1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. మాసఫలం
Written By రామన్
Last Updated : సోమవారం, 30 జూన్ 2025 (22:45 IST)

జూలై మాసంలో మీ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసా?

monthly horoscope
మేషరాశి : అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం
విశేషమైన ఫలితాలున్నాయి. వ్యవహారాల్లో మీదే పైచేయి. లక్ష్యాన్ని సాధిస్తారు. మీ కృషి ప్రశంసనీయమవుతుంది. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. దైవకార్యాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వ్యతిరేకులతో జాగ్రత్త. కొంతమంది మీ యత్నాలకు అడ్డుతగులుతారు. ఆశావహదృక్పథంతో మెలగండి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోండి. వివాహయత్నం లిస్తుంది. వేదికలు అన్వేషిస్తారు. సంతానం అత్యుత్సాహం కట్టడి చేయండి. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. వస్త్ర, బంగారం, వెండి వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆకర్షణీయమైన పథకాలతో కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. ఉద్యోగ విధులపై దృష్టిపెట్టండి. అధికారులకు హోదామార్పు, ఆకస్మిక స్థానచలనం. 
 
వృషభరాశి : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
అన్ని రంగాల వారికి ఆశాజనకం. పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. అవకాశాలు కలిసివస్తాయి. ఆదాయం ఫర్వాలేదనిపిస్తుంది. కొన్ని సమస్యల నుంచి విముక్తులవుతారు. దూరపు బంధువులతో తరచు సంభాషిస్తారు. అనవసర బాధ్యతలు చేపట్టవద్దు. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. మీ సిఫార్సుతో ఒకరికి సదావకాశం లభిస్తుంది. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు. ఆప్తులను విందులకు ఆహ్వానిస్తారు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. నూతన వ్యాపారాలపై దృష్టి పెడతారు. సంస్థల స్థాపనలకు అనుమతులు మంజూరవుతాయి. 
 
మిథునరాశి : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
మీ ఆర్థిక లావాదేవీలు కొలిక్కివస్తాయి. సముచిత నిర్ణయం తీసుకుంటారు. యత్నాలకు పెద్దల ఆశీస్సులుంటాయి. మనోధైర్యంతో యత్నాలు సాగించండి. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. బంధువులతో తెగిపోయిన సంబంధాలు బలపడతాయి. అసాధ్యమనుకున్న పనులు తేలికగా పూర్తి చేయగల్గుతారు. మీ సమర్థతపై నమ్మకం కలుగుతుంది. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. దూరప్రయాణం తలపెడతారు. ఒక ఆహ్వానం ఆలోచింపచేస్తుంది. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. మీ ప్రతిపాదనలకు అభ్యంతరాలు ఎదురవుతాయి. ఎదుటివారి అభిప్రాయంతో ఏకీభవించండి. ఉద్యోగస్తుల పదోన్నతికి అధికారులు సిఫార్సుచేస్తారు. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కుంటారు. దైవకార్య సమావేశంలో పాల్గొంటారు. 
 
కర్కాటకరాశి : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
శుభవార్త వింటారు. కష్టం ఫలిస్తుంది. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. వృధా ఖర్చులు తగ్గించుకోగల్గుతారు. అవకాశాలను కలిసివస్తాయి. చాకచక్యంగా పనులు చక్కబెట్టుకుంటారు. వివాహయత్నం ఫలిస్తుంది. కొత్త బంధుత్వాలు ఏర్పడతాయి. సంతానం విదేశీ చదువుపై దృష్టి పెడతారు. ఏజెన్సీలు, కన్సల్టెంట్ల విషయంలో జాగ్రత్త. అనుభవజ్ఞులను సంప్రదించండి. తొందరపాటు నిర్ణయాలు తగవు. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. సంస్థల స్థాపనలు, గృహ నిర్మాణాలకు అనుమతులు లభిస్తాయి. పత్రాల రెన్యువల్లో జాప్యం తగదు. మీ అలక్ష్యం ఇబ్బందులకు దారితీస్తుంది. ఆరోగ్యం జాగ్రత్త. క్రమం తప్పకుండా ఆహార నియమాలు పాటించండి, వస్త్ర, బంగారు వ్యాపారాలు ఊపందుకుంటాయి. చిరువ్యాపారులకు ఆశాజనకం. ఉద్యోగ విధులను సమర్ధంగా నిర్వహిస్తారు. అధికారులకు ధనప్రలోభం తగదు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. తీర్ధయాత్రకు సన్నాహాలు సాగిస్తారు.
 
సింహరాశి : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఈ మాసం మిశ్రమ ఫలితాలున్నాయి. లావాదేవీలతో తీరిక ఉండదు. స్థిమితంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఆశలొదిలేసుకున్న ధనం అందుతుంది. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలు కలిసివస్తాయి. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు. పరిచయస్తులు, బంధువుల రాకపోకలు అధికమవుతాయి. గృహం సందడిగా ఉంటుంది. అవగాహన లేని విషయాల జోలికి పోవద్దు. మీ వ్యక్తిత్వానికి భంగం కలుగకుండా మెలగండి. మీ సాయంతో ఒకరికి మేలు జరుతుంది. నగదు, విలువైన వస్తువులు జాగ్రత్త. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు, పనిభారం. అధికారులు మీ పదోన్నతికి సిఫార్సు చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆటుపోట్లను సమర్ధంగా ఎదుర్కుంటారు. మీ పథకాలు ఆశించిన ఫలితాలిస్తాయి. 
 
కన్యరాశి : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
మనోధైర్యంతో యత్నాలు సాగిస్తారు. మీ కృషిలో లోపం లేకుండా శ్రమించండి. పరిస్థితులు నిదానంగా చక్కబడతాయి. ఆదాయం బాగుంటుంది. విలాసాలకు విపరీతంగా ఖర్చుచేస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. సభ్యత్వాలు, బాధ్యతలు స్వీకరిస్తారు. వ్యతిరేకులతో జాగ్రత్త. గుట్టుగా మెలగండి. ఎవరినీ తక్కువ అంచనా వేయొద్దు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. అవివాహితులకు శుభయోగం. దూరపు బంధువుల ఆహ్వానం అందుకుంటారు. పత్రాల్లో సవరణలు సాధ్యపడతాయి. వాయిదాల చెల్లింపుల్లో జాప్యం తగదు. గృహమరమ్మతులు చేపడతారు. వాహనం, విలువైన వస్తువులు జాగ్రత్త. వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఉపాధ్యాయులకు పనిభారం. ఏజెన్సీలు, కాంట్రాక్టులు దక్కించుకుంటారు.
 
తులారాశి : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
శుభసమయం గోచరిస్తుంది. అద్భుత ఫలితాలు సాధిస్తారు. దూరపు బంధుత్వాలు బలపడతాయి. ఆదాయం బాగుంటుంది. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు. కొత్త పనుల ప్రారంభంలో ఆటంకాలు ఎదురవుతాయి. ఆత్మస్థైర్యంతో మెలగండి. ఏ విషయాన్నీ పెద్దగా పట్టించుకోవద్దు. వివాదాస్పద విషయాల్లో మీ ప్రమేయం లేకుండా చూసుకోండి. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. మధ్యవర్తులు, కన్సల్టెన్సీలను ఆశ్రయించవద్దు. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. మీ కృషిలో లోపం లేకుండా శ్రమించండి. మీ ప్రమేయంతో ఒకరికి మంచి జరుగుతుంది. ఆరోగ్యం సంతృప్తికరం. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఉద్యోగ బాధ్యతలపై శ్రద్ధ వహించండి. ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. దైవకార్య సమావేశంలో పాల్గొంటారు. 
 
వృశ్చికరాశి : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట
కార్యసాధనకు ఓర్పు ప్రధానం. మీ సామర్ధ్యంపై నమ్మకం పెంచుకోండి. ఎవరి సాయం ఆశించవద్దు. అవకాశాలు అందినట్టే చేజారిపోతాయి. చిన్న విషయానికే నిరుత్సాహపడతారు. ఆశావహదృక్పథంతో మెలగండి. ఈ చికాకులు తాత్కాలికమే. త్వరలో అనుకూలతలు నెలకొంటాయి. ఏ విషయాన్నీ తీవ్రంగా భావించవద్దు. సన్నిహితుల వ్యాఖ్యలు మీపై మంచి ప్రభావం చూపుతాయి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. అయిన వారు మీ అసక్తతను అర్థం చేసుకుంటారు. సంతానం ఉద్యోగయత్నం ఫలిస్తుంది. మానసికంగా కుదుటపడతారు. పత్రాల్లో సవరణలు సాధ్యమవుతాయి. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఉద్యోగ విధుల్లో అలక్ష్యం తగదు. ఉపాధ్యాయులకు అదనపు బాధ్యతలు. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. వాహనదారులకు దూకుడు తగదు. 
 
ధనుర్ రాశి : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
గ్రహస్థితి సామాన్యం. శ్రమించిన కొలదీ ఫలితాలుంటాయి. మాటతీరు అదుపులో ఉంచుకోండి. ఎవరినీ తక్కువ అంచనా వేయొద్దు. పెద్దల ప్రోత్సాహం కార్యోన్ముఖులను చేస్తుంది. మనోధైర్యంతో ముందుకు సాగుతారు. మీ కృషి వెంటనే ఫలిస్తుంది. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఖర్చులు తగ్గించుకోవటానికి యత్నించండి. సంస్థల స్థాపనలకు అనుమతులు మంజూరవుతాయి. మీ చొరవతో ఒకరికి మేలు జరుగుతుంది. ఇంటి విషయాలు పట్టించుకుంటారు. పత్రాల రెన్యువల్లో జాప్యం తగదు. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోండి. చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు. గత విషయాలు అనుభూతినిస్తాయి. వ్యాపారాలు నిదానంగా పుంజుకుంటాయి. ప్రైవేట్ ఉద్యోగస్తులకు కష్టసమయం. వృత్తుల వారికి సామాన్యం. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి.
 
మకరరాశి : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ఈ మాసం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కార్యసాధనకు మరింత శ్రమించాలి. ఏ విషయంలోనూ వెనుకడుగు వేయొద్దు. అవకాశం చేజారినా నిరుత్సాపడవద్దు. ఓర్పుతో యత్నాలు సాగించండి. ఊహించని ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. ఆపత్సమయంలో ఆత్మీయులు సాయం చేస్తారు. మీ శ్రీమతి ఆరోగ్యం కుదుటపడుతుంది. సన్నిహితులతో సంభాషిస్తుంటారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. ఇంటి విషయాలపై దృష్టి పెడతారు. సంతానం విదేశీ విద్యాయత్నం ఫలిస్తుంది. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. స్థిరచరాస్తుల వ్యవహారంలో జాగ్రత్త. అనాలోచిత నిర్ణయం తగదు. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. నూతన వ్యాపారాలు కలిసిరావు. ఉద్యోగ విధుల పట్ల శ్రద్ధ వహించండి. విందులు, దైవకార్యాలకు హాజరవుతారు. 
 
కుంభరాశి : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ఆర్థికలావాదేవీలు కొలిక్కివస్తాయి. రావలసిన ధనం అంతుంది. ఖర్చులు అధికం, సంతృప్తికరం. దైవకార్యాలకు విపరీతంతగా ఖర్చుచేస్తారు. తలపెట్టిన కార్యం విజయవంతమవుతుంది. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. పర్మిట్లు. లైసెన్సుల రెన్యువల్లో జాప్యం తగదు. మీ అలక్ష్యం ఇబ్బందులకు దారితీస్తుంది. ప్రముఖుల చొరవతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. వాహనం, గృహోపకరణాలు మరమ్మతుకు గురవుతాయి. వివాహయత్నం ఫలించే సూచనలున్నాయి. జాతక పొంతన ప్రధానం. అవతలి వారి స్తోమతను క్షుణ్ణంగా తెలుసుకోండి. ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. ప్రైవేట్ ఉద్యోగస్తులకు మార్పులు అనుకూలిస్తాయి. వస్త్ర, బంగారం వ్యాపారాలు ఊపందుకుంటాయి. దైవకార్య సమావేశాల్లో పాల్గొంటారు. 
 
మీనరాశి : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
ఆర్థికంగా బాగుంటుంది. ఊహించిన ఖర్చులే ఉంటాయి. ఆత్మీయుల ప్రోత్సాహం మిమ్ములను ముందుకు నడిపిస్తుంది. కలిసివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు. తెగిపోయిన బంధుత్వాలు బలపడతాయి. ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. ముఖ్యమైన వ్యవహారంలో ఏకాగ్రత వహించండి. మొహమ్మాటాలు, భేషజాలకు పోవద్దు. ప్రియతముల ఆరోగ్యం కుదుటపడుతుంది. గృహంలో మార్పుచేర్పులకు అనుకూలం. నగదు, ఆభరణాలు జాగ్రత్త. పనులు. బాధ్యతలు స్వయంగా చూసుకోండి. వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. అవగాహన లేని విషయాల జోలికి పోవద్దు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. వ్యాపారాల్లో గణనీయమైన పురోభివృద్ధి సాధిస్తారు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. చేతివృత్తులు, కార్మికులకు అవకాశాలు లభిస్తాయి.