సోమవారం, 25 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. మాసఫలం
Written By రామన్
Last Modified: గురువారం, 31 డిశెంబరు 2020 (23:02 IST)

1-1-2021 నుంచి 31-1-2021 వరకూ జనవరి రాశి ఫలితాలు

మేష రాశి: అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం
ఈ మాసం ప్రధమార్థం ఆశాజనకం. సంప్రదింపులు ఫలిస్తాయి. చాకచక్యంగా వ్యవహరిస్తారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. వస్త్రప్రాప్తి, వాహనయోగం వున్నాయి. సన్నిహితులను వేడుకలు, విందులకు ఆహ్వానిస్తారు. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధిత పనులు సానుకూలమవుతాయి. సంతానం అత్యుత్సాహం ఇబ్బంది కలిగిస్తుంది. గృహ మరమ్మతులు చేపడతారు. వృత్తి ఉపాధి పథకాలు సామాన్యంగా సాగుతాయి. వస్త్ర, పచారీ వ్యాపారులకు పురోభివృద్ధి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. కళాత్మక పోటీల్లో మహిళలు విజయం సాధిస్తారు. మీ బలహీనతలు అదుపులో వుంచుకోండి.
 
వృషభరాశి: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు
వ్యవహార దక్షతతో నెట్టుకొస్తారు. రావలసిన ధనం అందుతుంది. ఖర్చులు అదుపులో వుండవు. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. వ్యాపకాలు అధికమవుతాయి. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఉల్లాసంగా గడుపుతారు. గృహం సందడిగా వుంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. అప్రయత్నంగా అవకాశాలు కలిసివస్తాయి. సంస్థల స్థాపనకు అనుకూలం. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. ఆంతరంగిక విషయాలు గోప్యంగా వుంచండి. పోగొట్టుకున్న వస్తువులు లభ్యం కావు. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. న్యాయ, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కొంటారు. మీ పథకాలు సత్ఫలితాలిస్తాయి. పందాలు, జూదాల జోలికి పోవద్దు.
 
మిధున రాశి: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ప్రేమానుబంధాలు బలపడతాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. ప్రభుత్వ సంబంధిత పనులు సానుకూలమవుతాయి. గృహం సందడిగా వుంటుంది. ఖర్చులు అంచనాలను మించుతాయి. వస్త్రప్రాప్తి, వాహనయోగం పొందుతారు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. అవివాహితులకు శుభయోగం. పెట్టుబడులకు తరుణం కాదు. కార్యసిద్ధికి అవిశ్రాంతంగా శ్రమిస్తారు. సంతానం చదువులపై మరింత శ్రద్ధ వహించాలి. పత్రాలు అందుకుంటారు. ఒక సమాచారం ఆలోచింపజేస్తుంది. వస్త్ర, పచారీ వ్యాపారులకు పురోభివృద్ధి. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. ఉద్యోగస్తులకు ధనలాభం. అధికారులకు స్థానచలనం. ఉపాధి పథకాలు కలిసివస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రయాణంలో అవస్తలు తప్పవు.
 
కర్కాటక రాశి: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
కార్యక్రమాలు విజయవంతమవుతాయి. ఏది తలపెట్టినా కలిసివస్తుంది. ఆదాయం సంతృప్తికరం. ఖర్చులు భారమనిపించవు. అయినవారితో ఉల్లాసంగా గడుపుతారు. పనుల్లో ఒత్తిడి అధికం. వ్యవహారానుకూలత వుంది. సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. బంధువుల వైఖరి కష్టమనిపిస్తుంది. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. విలువైన వస్తువులు జాగ్రత్త. ప్రకటనలు, సందేశాల పట్ల అప్రమత్తంగా వుండాలి. గృహ మరమ్మతులు చేపడతారు. అస్వస్థతకు గురవుతారు. వైద్య సేవలు అవసరం. ఉద్యోగస్తులు అధికారులతో సత్సంబంధాలు నెలకొంటాయి. సహోద్యోగులతో వేడుకలు, సమావేశాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. కళాత్మక పోటీలు ఉల్లాసంగా కలిగిస్తాయి. దైవ, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
 
సింహరాశి: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఈ మాసం యోగదాయకం. అప్రయత్నంగా అవకాశాలు కలిసివస్తాయి. కార్యసిద్ధి, ధనయోగం వున్నాయి. ఖర్చులు అదుపులో వుండవు. విలాసాలకు వ్యయం చేస్తారు. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. దంపతుల మధ్య అరమరికలు తగవు. వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. ముఖ్యమైన వస్తువులు సమయానికి కనిపించవు. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. ప్రత్యర్థులతో జాగ్రత్త. ఆంతరంగిక విషయాలు గోప్యంగా వుంచండి. సంతానం భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది. ఉద్యోగస్తులకు బాధ్యతల మార్పు. అధికారలకు ఒత్తిడి, పనిభారం. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. మీ పథకాలు సత్ఫలితాలిస్తాయి. ఆలయాలు, కొత్త ప్రదేశాలు సందర్శిస్తారు.
 
కన్యారాశి: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
అన్ని రంగాల వారికి ఆశాజనకమే. మీ వాక్కు ఫలిస్తుంది. అనుకున్నది సాధిస్తారు. గౌరవప్రతిష్టలు ఇనుమడిస్తాయి. అవకాశాలను దక్కించుకుంటారు. ఆదాయం సంతృప్తికరం. ఊహించిన ఖర్చులే వుంటాయి. ఖరీదైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పత్రాలు జాగ్రత్త. బాధ్యతలను అప్పగించవద్దు. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. మీ జోక్యం అనివార్యం. ఆప్తులకు చక్కని సలహాలిస్తారు. గృహ మరమ్మతులు చురుకుగా సాగుతాయి. అవివాహితలకు శుభదాయకం. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉమ్మడి వ్యాపారాలకు అనుకూలం. ఉద్యోగస్తులకు ధనయోగం. అధికారులకు ఒత్తిడి, పనిభారం. కళాత్మక పోటీల్లో స్త్రీలు విజయం సాధిస్తారు. దైవదర్శనాలు సంతృప్తినిస్తాయి. జూదాలు, పందాల్లో నష్టాలు ఎదుర్కొంటారు.
 
తులారాశి: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
సంప్రదింపులకు అనుకూలం. వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. పెద్దల సలహా పాటించండి. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. ఆదాయ వ్యయాలకు పొంతన వుండదు. విలాసాలకు వ్యయం చేస్తారు. గృహం సందడిగా వుంటుంది. ప్రభుత్వ సంబంధిత పనులు పూర్తవుతాయి. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం ఆసక్తి కలిగిస్తుంది. దంపతుల మధ్య అరమరికలు తగవు. సంతానం చదువులపై మరింత శ్రద్ధ అవసరం. ఆరోగ్యం స్థిరంగా వుంటుంది. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. వస్త్ర, పచారీ వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. పెట్టుబడులకు అనుకూలం. వైద్య, న్యాయ, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. క్రీడా పోటీలు ఉల్లాసం కలిగిస్తాయి. దైవ, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
 
వృశ్చికరాశి: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట
ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. రుణ సమస్యలు పరిష్కారమవుతాయి. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. మానసికంగా కుదుటపడుతారు. పనులు వేగవంతమవుతాయి. వస్త్రప్రాప్తి, వాహన యోగం పొందుతారు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. సన్నిహితులను వేడుకలు, విందులకు ఆహ్వానిస్తారు. నగదు, ఆభరణాలు జాగ్రత్త. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలను ఖచ్చితంగా తెలియజేయండి. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. సహోద్యోగులతో జాగ్రత్త. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. కళాత్మక పోటీలు నిరుత్సాహపరుస్తాయి. ప్రయాణం, దైవదర్శనాల్లో అవస్తలు తప్పవు.
 
ధనస్సు రాశి: మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ 1వ పాదం
ఈ మాసం శుభదాయకం. ఆదాయం బాగుంటుంది. ఖర్చులు భారమనిపించవు. అనుకున్నది సాధిస్తారు. మీ నమ్మకం వమ్ముకాదు. ఉల్లాసంగా గడుపుతారు. అసాధ్యమనుకున్న పనులు తేలికగా పూర్తవుతాయి. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. మధ్యవర్తులను విశ్వసించవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. పనులు సానుకూలమవుతాయి. పత్రాలు, ఆహ్వానం అందుకుంటారు. సంతానం కదలికలపై దృష్టి పెట్టండి. చెప్పుడు మాటలు పట్టించుకోవద్దు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు సంభవం. ఆశించిన పదవులు దక్కకపోవచ్చు. ఏది జరిగినా మంచికేనని భావించండి. ఉద్యోగస్తులకు ధనయోగం. అధికారులకు హోదా మార్పు. వ్యాపారాల్లో రాణింపు, అనుభవం గడిస్తారు. నూతన వ్యాపారాలు కలిసి వస్తాయి. సేవ, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
 
మకర రాశి: ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
మీ ఓర్పునకు పరీక్షా సమయం. ప్రతి చిన్న విషయానికి ఆందోళన చెందుతారు. ఆలోచనలతో సతమతమవుతారు. ఆదాయం అంతంతమాత్రమే. ఖర్చులు అధికం. ఆత్మీయుల కలయికతో కుదుటపడుతారు. సంతానం చదువులపై మరింత శ్రద్ధ వహించాలి. ప్రభుత్వ కార్యాలయాలలో పనులు మందకొడిగా సాగుతాయి. పత్రాలు అందుకుంటారు. మీ సమర్థతపై నమ్మకం పెంచుకోండి. అవకాశాలు చేజారినా ఒకందుకు మంచిదే. త్వరలో మీ కృషి ఫలిస్తుంది. ఆరోగ్యం పట్ల మెలకువ వహించండి. అయినవారు మీ అసక్తతను అర్థం చేసుకుంటారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. ఉపాధి పథకాలు నిరుత్సాహపరుస్తాయి. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. జూదాల జోలికి పోవద్దు.
 
కుంభరాశి: ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు
ఈ మాసం శుభాశుభాల మిశ్రమం. ఆర్థిక లావాదేవీలతో తీరక ఉండదు. శ్రమాధిక్యత, అకాల భోజనం. ఖర్చులు విపరీతం. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పత్రాలు జాగ్రత్త. మీ శ్రీమతి వైఖరి అసహనం కలిగిస్తుంది. సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. ఆత్మీయుల రాక ఉపశమనం కలిగిస్తుంది. ఇంటి విషయాలపై దృష్టి పెడతారు. గృహంలో మార్పుచేర్పులకు అనుకూలం. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. దళారులను విశ్వసించవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. సంతానం విషయంలో శుభపరిణామాలున్నాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. వృత్తుల వారికి ఆశాజనకం. క్రీడా పోటీల్లో విజయం సాధిస్తారు. దైవ దర్శనంలో అవస్తలు తప్పవు. ప్రయాణంలో జాగ్రత్త.
 
మీనరాశి: పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
ఆదాయం బాగుంటుంది. వస్త్రప్రాప్తి. వస్తులాభం వున్నాయి. బంధువులతో ఉల్లాసంగా గడుపుతారు. గృహం సందడిగా వుంటుంది. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. అవకాశాలు కలిసివస్తాయి. విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతాయి. ఎదురుచూస్తున్న పత్రాలు అందుకుంటారు. ఒక వ్యవహారంలో మీ జోక్యం అనివార్యం. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రకటనలు, సందేశాల పట్ల అప్రమత్తంగా వుండాలి. ఆర్థిక వివరాలు వెల్లడించవద్దు. నమ్మకస్తులే మోసగించేందుకు యత్నిస్తారు. సంతానం దూకుడు అదుపు చేయండి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. ఉద్యోగస్తులకు బాధ్యతల మార్పు. అధికారులకు పనిభారం, విశ్రాంతిలోపం. కళాత్మక పోటీల్లో స్త్రీలు విజయం సాధిస్తారు. వేడుకల్లో అత్యుత్సాహం తగదు.