మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వారఫలం
Written By రామన్
Last Updated : శనివారం, 26 డిశెంబరు 2020 (23:57 IST)

27-12-2020 నుంచి 02-01-2021 వరకూ మీ వార రాశి ఫలితాలు

మేషం: అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం
లక్ష్యసాధనకు మరింత శ్రమించాలి. యత్నాలు విరమించుకోవద్దు. ఆదాయం సంతృప్తికరం. ఊహించిన ఖర్చులే వుంటాయి. పెట్టుబడులకు సమయం కాదు. ఆది, సోమ వారాల్లో ఒత్తిడి అధికం. పనులు సాగక విసుగు చెందుతారు. ఆప్తుల కలయిక వీలుపడదు. గృహంలో స్తబ్దత నెలకొంటుంది. అయినవారు మీ అసక్తతను అర్థం చేసుకుంటారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. శుభకార్యానికి తీవ్రంగా యత్నాలు సాగిస్తారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. పత్రాలు అందుకుంటారు. ఆరోగ్యం నిలకడగా వుంటుంది. వస్త్ర, ఫ్యాన్సీ వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. కార్మికులు, చేతివృత్తుల వారికి ఆశాజనకం. మార్కెట్ రంగాల వారికి ఆదాయాభివృద్ధి. వేడుకల్లో అత్యుత్సాహం తగదు.
 
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు
వ్యవహారానుకూలత వుంది. సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. మీ కష్టం ఫలిస్తుంది. సోదరులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఆదాయం బాగుంటుంది. ఖర్చులు భారమనిపించవు. మంగళ, బుధ వారాల్లో అప్రమత్తంగా వుండాలి. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. పనులు సావకాశంగా పూర్తి చేస్తారు. సన్నిహితుల కలయిక ఉత్సాహాన్నిస్తుంది. వేడుకకు సన్నాహాలు చేస్తారు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. విలువైన వస్తువులు జాగ్రత్త. అనవసర బాధ్యతలు చేపట్టి ఇబ్బందులెదుర్కుంటారు. ఉద్యోగస్తులకు శుభయోగం. కొత్త అధికారులను ఆకట్టుకుంటారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆత్మీయుల క్షేమం తెలుసుకుంటారు. వాహన చోదకులకు దూకుడు తగదు. పుణ్యక్షేత్ర సందర్శనలు ఉల్లాసం కలిగిస్తాయి.
 
మిధునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ప్రణాళికలు రూపొందించుకుంటారు. ఖర్చులు అధికం. ప్రయోజనకరం. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. ఆలయాలకు విరాళాలు అందిస్తారు. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. గృహం సందడిగా వుంటుంది. మీ జోక్యం అనివార్యం. ఆప్తులకు చక్కని సలహాలిస్తారు. గురు, శుక్ర వారాల్లో పనులు హడావుడిగా సాగుతాయి. పరిచస్తులు రాక ఇబ్బంది కలిగిస్తుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు సంభవం. సంతానం దూకుడు అదుపు చేయండి. విద్యా సంస్థలకు కొత్త సమస్యలెదురువుతాయి. వ్యాపారాల్లో గణనీయమైన పురోభివృద్ధి సాధిస్తారు. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. అధికారులకు హోదా మార్పు. స్టాక్ మార్కెట్ రంగాల వారికి ఆశాజనకం. షేర్ల క్రయవిక్రయాలు లాభిస్తాయి. జూదాలు, బెట్టింగులకు పాల్పడవద్దు.
 
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
అన్ని రంగాల వారికి శుభసూచకమే. కార్యక్రమాలు విజయవంతమవుతాయి. అనుకున్నది సాధిస్తారు. ధన లాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. శనివారం నాడు దుబారా ఖర్చులు విపరీతం. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. మీ సిఫార్సుతో ఒకరికి సదవకాశం లభిస్తుంది. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. మీ విషయాల్లో ఇతురల జోక్యానికి తావివ్వద్దు. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. మీ శ్రీమతి సలహా పాటించండి. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. హోల్ సేల్ వ్యాపారులు, స్టాకిస్టులకు ఆదాయాభివృద్ధి. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. వేడుకకు హాజరవుతారు. బంధువుల ఆదరణ సంతృప్తినిస్తుంది. ప్రయాణంలో అవస్తలు తప్పవు.
 
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
సమర్థతను చాటుకుంటారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. పదవులు, సభ్యత్వాల స్వీకరణకు అనుకూలం. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. ఆదాయం బాగుంటుంది. విలాసాలకు వ్యయం చేస్తారు. ఆది, మంగళ వారాల్లో అప్రమత్తంగా వుండాలి. నమ్మకస్తులే వంచించేందుకు యత్నిస్తారు. బాధ్యతలు, పనులు స్వయంగా చూసుకోవాలి. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. ఆరోగ్యం జాగ్రత్త. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం నిశ్చయమయ్యే సూచనలున్నాయి. సంతానం దూకుడు అదుపు చేయండి. వస్త్ర, ఫ్యాన్సీ, పచారీ వ్యాపారాలు ఊపందుకుంటాయి. సరుకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగస్తులు నూతన అధికారులను ఆకట్టుకుంటారు. క్రీడా పోటీలు ఉల్లాసం కలిగిస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. ఉత్సాహంగా గడుపుతారు. ఖర్చులు అదుపులో వుండవు. ప్రతి వ్యవహారం ధనంతో ముడిపడి వుంటుంది. బుధ, గురు వారాల్లో అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి. పనులు సావకాశంగా పూర్తి చేస్తారు. పత్రాల రెన్యువల్లో అలక్ష్యం తగదు. సంతానం చదువులపై మరింత శ్రద్ధ వహించాలి. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. వాస్తుకు అనుగుణంగా గృహమార్పులు చేపడతారు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. ఉమ్మడి వ్యాపారాలు కలిసివస్తాయి. వాహనం ఇతరులకివ్వవద్దు. పోటీల్లో విజయం సాధిస్తారు.
 
తుల: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
కార్యసాధనకు ఓర్పు ప్రధానం. మీ కష్టం ఫలిస్తుంది. మానసికంగా కుదుటపడతారు. ఆదాయం బాగుంటుంది. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. పరిచయస్తులు ధన సహాయం అర్థిస్తారు. పెద్దమొత్తం సాయం తగదు. మీ ఇష్టాయిష్టాలను సున్నితంగా వ్యక్తం చేయండి. శని, ఆది వారాల్లో పనులు హడావుడిగా సాగుతాయి. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఏ సంబంధం కలిసిరాక నిస్తేజానికి లోనవుతారు. దంపతుల మధ్య దాపరికం తగదు. ఆత్మీయుల రాక ఉపశమనం కలిగిస్తుంది. పత్రాలు అందుకుంటారు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. మీ పథకాలు సత్ఫలితాలిస్తాయి. ఉద్యోగస్తులకు శుభయోగం. పురస్కారాలు అందుకుంటారు. వేడుకకు హాజరవుతారు. వాహన చోదకులకు సమస్యలెదురవుతాయి.
 
వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట
అనుకూలతలున్నాయి. మీ కష్టం ఊరికే పోదు. ధనలాభం వుంది. అవసరాలు నెరవేరుతాయి. మానసికంగా కుదుటపడతారు. కొత్త పనులు ప్రారంభిస్తారు. అవకాశాలు కలిసివస్తాయి. వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు. సోమ, మంగళ వారాల్లో అనవసర జోక్యం తగదు. మంచి చేయబోతే చెడు ఎదురవుతుంది. బంధువులతో తెగిపోయిన సంబంధాలు బలపడతాయి. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఆరోగ్యం కుదుటపడుతుంది. వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. సంతానం విషయంలో శుభఫలితాలున్నాయి. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. పెద్దమొత్తం సరుకు నిల్వలో జాగ్రత్త. ఉపాధ్యాయులకు కొత్త సమస్యలెదురవుతాయి. స్టాక్ మార్కెట్ రంగాల వారికి పురోభివృద్ధి. ఆలయాలు సందర్శిస్తారు. పోటీలు ఉల్లాసం కలిగిస్తాయి.
 
ధనస్సు: మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాడ 1వ పాదం
ఈ వారం ఆశాజనకం. ఒత్తిళ్ల నుంచి బయటపడతారు. కష్టం ఫలిస్తుంది. తలపెట్టిన పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. ఆదాయం సంతృప్తికరం. ఖర్చులు తగ్గించుకుంటారు. వ్యాపకాలు అధికమవుతాయి. బాధ్యతలు అప్పగించవద్దు. గృహంలో మార్పులకు అనుకూలం. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. అతిగా శ్రమించవద్దు. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. సంతానం దూకుడు ఇబ్బంది కలిగిస్తుంది. పోగొట్టుకున్న వస్తువులు లభ్యం కావు. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు, పనిభారం. అధికారులకు వీడ్కోలు పలుకుతారు. ఉపాధి పథకాలు కలిసివస్తాయి. జూదాలు, బెట్టింగుల జోలికి పోవద్దు.
 
మకరం: ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. విమర్శలు ఎదుర్కొంటారు. బంధుమిత్రుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. ఖర్చులు విపరీతం. కొంత మొత్తం ధనం అందుతుంది. పనులు సాగక విసుగు చెందుతారు. మనోధైర్యంతో వ్యవహరించండి. అవకాశాలు చేజారినా ఒకందుకు మంచిదే. సన్నిహితుల కలయిక ఉపశమనం కలిగిస్తుంది. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. కుటుంబీకుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. సంతానం కదలికలపై దృష్టి పెట్టండి. వ్యాపారాభివృద్ధికి తీవ్రంగా శ్రమిస్తారు. మీ పథకాలు సత్ఫలితాలిస్తాయి. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణావకాశం లభిస్తుంది. మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి అధికం. ఆత్మీయలకు వీడ్కోలు పలుకుతారు. క్రీడా పోటీలు ఉల్లాసం కలిగిస్తాయి.
 
కుంభం: ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు
శ్రమాధిక్యత మినహా ఫలితం వుండదు. ఆలోచనలతో సతమతమవుతారు. నిరుత్సాహం వీడి యత్నాలు సాగించండి. స్వయంకృషితోనే రాణిస్తారు. మీ శ్రీమతి సలహా పాటించండి. ఆదాయ వ్యయాలకు పొంతన వుండదు. ఖర్చులు, పెరిగిన ధరలు ఆందోళన కలిగిస్తాయి. శని, ఆది వారాల్లో పనులు సాగవు. మీపై శకునాల ప్రభావం అధికం. ఆత్మీయుల రాక ఉపశమనం కలిగిస్తుంది. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. పత్రాల రెన్యువల్లో అలక్ష్యం తగదు. పాత పరిచయస్తులను కలుసుకుంటారు. ఆరోగ్యం నిలకడగా వుంటుంది. ఉద్యోగస్తులకు పనిభారం. న్యాయ, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. దైవదర్శనాలు అనుకూలిస్తాయి.
 
మీనం: పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
వేడుకను దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ప్రముఖుల రాక సంతోషాన్నిస్తుంది. ధన లాభం, వస్త్ర ప్రాప్తి వున్నాయి. కొన్ని పనులు ఆకస్మికంగా పూర్తి చేస్తారు. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. పరిచయాలు బలపడతాయి. పత్రాలు, ఆభరణాలు జాగ్రత్త. బాధ్యతలు అప్పగించవద్దు. సంతానం చదువులపై మరింత శ్రద్ధ వహించాలి. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. నగదు చెల్లింపుల్లో మెలకువ వహించండి. గృహమరమ్మతులు చేపడతారు. సంస్థల స్థాపనలకు అనుకూలం. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. సరకు నిల్వలో జాగ్రత్త. ప్రైవేట్ సంస్థ ఉద్యోగస్తులకు మార్పులు అనుకూలిస్తాయి. స్టాక్ మార్కెట్ రంగాల వారికి ఆశాజనకం. క్రీడ, సాహిత్య రంగాల వారికి ప్రోత్సాహకరం.