గురువారం, 23 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వార్షిక ఫలం
Written By రామన్
Last Updated : శుక్రవారం, 18 డిశెంబరు 2020 (14:19 IST)

కన్యా రాశి 2021: ఆర్థిక సమస్యల విషయంలో... Video

కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ఆదాయం: 5 వ్యయం: 5  రాజపూజ్యం: 5  అవమానం: 2
ఈ రాశివారికి ఈ ఏడాది అన్నివిధాలా అనుకూలతలున్నాయి. దీర్ఘకాలిక వ్యాధులు, ఆర్థిక సమస్యల నుంచి విముక్తులవుతాయి. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. స్థిరాస్థి కొనుగోలు దిశగా యత్నాలు సాగిస్తారు. గృహంలో ఉత్సాహపూరిత వాతావరణం నెలకొంటుంది. ప్రేమానుబంధాలు బలపడతాయి. శుభకార్యం తలపెడతారు.
 
బంధుత్వాలు బలపడతాయి. వ్యవహారాలు మీ చేతుల మీదుగా సాగుతాయి. నిరుద్యోగులకు యోగకాలం. ఉద్యోగస్తులు అధికారుల మన్ననలు పొందుతారు. రైతులకు ఆశాజనకం. వ్యవసాయ దిగుబడులు సంతృప్తినిస్తాయి. పంట డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. ఏజెన్సీలు దక్కించుకుంటారు. పదవుల స్వీకరణకు అవరోధాలు తొలగిపోతాయి. 
 
వ్యాపారాభివృద్ధికి కొత్త పథకాలు చేపడతారు. భాగస్వామిక వ్యాపారాలు కలిసివస్తాయి. ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా వుండాలి. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. విద్యార్థులకు ఏకాగ్రత ప్రధానం. పోటీపరీక్షలు ఆందోళన కలిగిస్తాయి. న్యాయవాదులు ప్రోత్సాహకరం. వైద్యరంగాల వారికి ఆదాయాభివృద్ధి. తరచు ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.