మంగళవారం, 26 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వారఫలం
Written By రామన్
Last Updated : ఆదివారం, 20 డిశెంబరు 2020 (20:56 IST)

20-12-2020 నుంచి 26-12-2020 వరకూ మీ వార రాశి ఫలితాలు

మేషం: అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. ఆప్తుల హితవు మీపై మంచి ప్రభావం చూపుతుంది. విమర్శలకు ధీటుగా స్పందిస్తారు. మీపై వచ్చిన అభియోగాలు తొలగిపోగలవు. సోదరులతో సత్సంబంధాలు నెలకొంటాయి. పనుల ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. మంగళ, బుధ వారాల్లో ఖర్చులు విపరీతం. రాబడిపై దృష్టి పెడతారు. ఒక సమాచారం తీవ్రంగా ఆలోచింపజేస్తుంది. ప్రముఖులను కలుసుకుంటారు. సంతానం చదువులపై మరింత శ్రద్ధ వహించాలి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. చిరు వ్యాపారులకు ఆదాయం బాగుంటుంది. ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలను సరిదిద్దుకుంటారు. వేడుకకు హాజరవుతారు. జూదాలు, బెట్టింగులకు పాల్పడవద్దు.
 
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు
ప్రతికూల పరిస్థితులు నెలకొంటాయి. ఏకపక్ష నిర్ణయాలు తగవు. మీ ప్రతిపాదనలకు వ్యతిరేకత ఎదురవుతుంది. ఎదుటివారి తీరును గమనించి మెలగండి. కొన్ని విషయాలు అనుకున్నట్లే జరుగుతాయి. ఆదాయం సంతృప్తికరం. ఖర్చులు భారమనిపించవు. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. ఆది, గురు వారాల్లో పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. శుభకార్యానికి తీవ్రంగా యత్నాలు సాగిస్తారు. బంధుమిత్రులతో విభేదాలు తలెత్తుతాయి. సంతానం కదలికలపై దృష్టి సారించండి. గృహమార్పు త్వరలో కలిసివస్తుంది. కనిపించకుండా పోయిన పత్రాలు లభ్యమవుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. ఉద్యోగస్తుకు యూనియన్ వ్యవహారాలతో తీరిక వుండదు. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు.
 
మిధునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
సర్వత్రా అనుకూలతలున్నాయి. అనుకున్నది సాధిస్తారు. పదువులు, సభ్యత్వాలు స్వీకరణకు అనుకూలం. పరిచయాలు బలపడతాయి. సాధ్యం కాని హామీలివ్వవద్దు. ఆదాయ వ్యయాలకు పొంతన వుండదు. ఖర్చులు విపరీతం. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పత్రాలు జాగ్రత్త. శుక్ర, శని వారాల్లో పనులు అనుకున్న విధంగా సాగవు. పరిచయస్తుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. ఒక వ్యవహారంలో మీ జోక్యం అనివార్యం. సంతానం చదువులపై శ్రద్ధ వహిస్తారు. ప్రైవేట్ విద్యాసంస్థలకు కొత్త సమస్యలు ఎదురవుతాయి. వ్యాపారాల్లో లాభాలు, అనుభవం గడిస్తారు. హోల్ సేల్ వ్యాపారులకు ఆదాయాభివృద్ధి. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. అధికారులకు హోదా మార్పు, స్థాన చలనం. వైద్య, సాంకేతిక రంగాల వారికి ఆశాజనకం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.
 
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ప్రేమానుబంధాలు బలపడతాయి. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. గృహం సందడిగా వుంటుంది. వ్యవహారాలతో తీరిక వుండదు. ఆది, సోమ వారాల్లో ఒత్తిడి, శ్రమ అధికం. ఆప్తుల కలయిక వీలుపడదు. పనులు హడావుడిగా సాగుతాయి. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. ప్రైవేట్ సంస్థల్లో మదుపు తగదు. మీ ప్రమేయంతో శుభకార్యం నిశ్చయమవుతుంది. వేడుకలకు సన్నాహాలు సాగిస్తారు. నిర్మాణాలు, మరమ్మతులు వేగవంతమవుతాయి. ఆరోగ్యం సంతృప్తికరం. పోగొట్టుకున్న పత్రాలు తిరిగి సంపాదిస్తారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు సంతృప్తినిస్తాయి. మార్కెట్ రంగాల వారికి ఆదాయాభివృద్ధి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నూతన వ్యాపారాలకు అనుకూలం. ప్రయాణంలో ఇబ్బందులెదురవుతాయి. 
 
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
మనోధైర్యంతో ముందుకు సాగుతారు. కార్యసిద్ధి, ధన లాభం వున్నాయి. సోదరులతో అవగాహన నెలకొంటుంది. వివాదాలు సద్దుమణుగుతాయి. మానసికంగా కుదుటపడతారు. ఖర్చులు అధికం, డబ్బుకు ఇబ్బంది వుండదు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు పూర్తవుతాయి. నిర్మాణాలు, మరమ్మతులు చేపడతారు. మంగళ, బుధ వారాల్లో అపరిచితులతో జాగ్రత్త. దంపతుల మధ్య దాపరికం తగదు. ఆరోగ్యం సంతృప్తికరం. విలువైన వస్తువులు, పత్రాలు జాగ్రత్త. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. సంతానం చదువులపై శ్రద్ధ వహించండి. వస్త్ర, ఫ్యాన్సీ వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. హోల్ సేల్ వ్యాపారులకు ఆశాజనకం. ఉద్యోగస్తులకు పనిభారం, విశ్రాంతి లోపం. శుభకార్యానికి హాజరవుతారు.
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. ఊహించిన ఖర్చులే వుంటాయి. ఆప్తులకు సాయం అందిస్తారు. పరిచయాలు బలపడతాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. గృహం ప్రశాంతంగా వుంటుంది. మీ జోక్యంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. గురు, శుక్ర వారాల్లో ఫోన్ సందేశాలను విశ్వసించవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. బ్యాంకు వివరాలను గోప్యంగా వుంచండి. గృహంలో మార్పుచేర్పులకు అనుకూలం. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఆహ్వానం అందుకుంటారు. సంతానం విషయంలో శుభఫలితాలున్నాయి. నూతన వ్యాపారాలకు అనుకూలం. ఉపాధి అవకాశాలు కలిసి వస్తాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. అధికారులకు ధన ప్రలోభం తగదు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. దైవ, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.
 
తుల: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ఈ వారం కలిసివచ్చే సమయం. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. సమర్థతకు ఆలస్యంగా గుర్తింపు లభిస్తుంది. వ్యవహార ఒప్పందాల్లో మెలకువ వహించండి. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు. మీ అభిప్రాయాలను ఖచ్చితంగా వ్యక్తం చేయండి. మీ శ్రీమతి విషయంలో దాపరికం తగదు. గృహమార్పు కలిసి వస్తుంది. ఖర్చులు అదుపులో వుండవు. ఒక అవసరానికి వుంచిన ధనం మరోదానికి వ్యయం చేస్తారు. ఎదురుచూస్తున్న పత్రాలు అందుతాయి. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. గత సంఘటనలు కొత్త అనుభూతినిస్తాయి. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. షాపు పనివారలతో జాగ్రత్త. ఉద్యోగస్తులు కొత్త అధికాలను ఆకట్టుకుంటారు. ఉపాధి పథకాలు కలిసివస్తాయి. వేడుకకు హాజరవుతారు. బంధుమిత్రుల ఆతిథ్యం ఆకట్టుకుంటుంది.
 
వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట
పరిస్థితులు మెరుగుపడతాయి. పెద్దల సాయంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. గృహం ప్రశాంతంగా వుంటుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ఖరీదైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. ఇతురుల బాధ్యతలు చేపట్టి ఇబ్బందులెదుర్కుంటారు. సంతానం విజయం ఉపశమనం కలిగిస్తుంది. అవివాహితులకు శుభయోగం. పరిచయాలు బలపడతాయి. మీ శ్రీమతివైఖరిలో మార్పు వస్తుంది. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. అతిగా శ్రమించవద్దు. విశ్రాంతి అవసరం. కొత్త వ్యాపారాలు కలిసివస్తాయి. సొంత వ్యాపారాలే శ్రేయస్కరం. ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. మెడికల్, ఇంజినీరింగ్ విద్యార్థులకు కొత్త సమస్యలు ఎదురవుతాయి. ఆకస్మిక ప్రయాణం తలపెడతారు.
 
ధనస్సు: మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ 1వ పాదం
సంప్రదింపులు నిరుత్సాహపరుస్తాయి. ఆలోచనలతో సతమతమవుతారు. ఏ విషయంపై ఆసక్తి వుండదు. రుణ ఒత్తిడి అధికం. శని, ఆది వారాల్లో ఖర్చులు విపరీతం. అంచనాలు తారుమారవుతాయి. ఆప్తులకు సాయం అందిస్తారు. మనోధైర్యంతో మెలగండి. ఎవరినీ తప్పు పట్టవద్దు. పెద్దల మాట ఆలకించండి. గృహంలో స్తబ్దత నెలకొంటుంది. అయినవారు మీ అసక్తతను అర్థం చేసుకుంటారు. ఈ చికాకులు తాత్కాలికమే. త్వరలో పరిస్థితులు సర్దుకుంటాయి. ముఖ్యమైన పత్రాలు అందుకుంటారు. విలువైన వస్తువులు జాగ్రత్త. గృహమార్పు ఫలితం నిదానంగా కనిపిస్తుంది. ఇంటి విషయాలపై మరింత శ్రద్ధ వహించాలి. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. పెద్దమొత్తం సరుకు నిల్వ తగదు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. ఉపాధి పథకాలు ఏమంత సంతృప్తినీయవు. ఆధ్యాత్మికతపై దృష్టి మళ్లుతుంది. దైవ కార్యాల్లో పాల్గొంటారు. కొత్త పరిచయాలేర్పడతాయి.
 
మకరం: ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
వ్యవహారానుకూలత వుంది. అనుకున్నది సాధిస్తారు. అందరితో సత్సంబంధాలు నెలకొంటాయి. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం ఆసక్తి కలిగిస్తుంది. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. సోమ, మంగళ వారాల్లో పనుల్లో ఒత్తిడి అధికం. కుటుంబీకుల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. కార్యక్రమాలు ముందుకు సాగవు. ఆప్తుల కలయిక ధైర్యాన్నిస్తుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. గృహమార్పు కలిసివస్తుంది. నూతన పెట్టుబడులు కలిసివస్తాయి. వస్త్ర, ఫ్యాన్సీ, మందుల వ్యాపారులకు పురోభివృద్ధి. ఉద్యోగ బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తారు. నిరుద్యోగలకు సదవకాశాలు లభిస్తాయి. వేడుకలకు హాజరవుతారు. బంధువుల ఆతిథ్యం ఆకట్టుకుంటుంది. వాహనం నడిపేటపుడు జాగ్రత్త.
 
కుంభం: ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు
యత్నాలు ఫలిస్తాయి. మాటతీరు ఆకట్టుకుంటుంది. ధనలాభం, వస్త్రప్రాప్తి వున్నాయి. ఆపన్నులకు సాయం అందిస్తారు. పరిచయాలు, బంధుత్వాలు బలపడతాయి. మీ జోక్యంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. ఖర్చులు విపరీతం. డబ్బుకు ఇబ్బంది వుండదు. బుధ, గురు వారాల్లో పనులతో సతమతమవుతారు. బాధ్యతలు అప్పగించవద్దు. పత్రాల రెన్యువల్లో మెలకువ వహించండి. స్వల్ప అశ్వస్థతకు గురవుతారు. నూతన వ్యాపారాలకు అనుకూలం. చిరు వ్యాపారులకు ఆదాయాభివృద్ధి. మార్కెట్ రంగాల వారికి మార్పులు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. కొత్త అధికారులతో సత్సంబంధాలు నెలకొంటాయి. 
 
మీనం: పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
అన్ని రంగాల వారికి శుభదాయకమే. ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. పదవులు, సభ్యత్వాలు స్వీకరిస్తారు. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. గృహం సందడిగా వుంటుంది. ఆత్మీయులకు ముఖ్య సమాచారం అందిస్తారు. ఖర్చులు అదుపులో వుండవు. ఒక అవసరానికి వుంచిన ధనం మరోదానికి వ్యయం చేస్తారు. శుక్ర, శని వారాల్లో వ్యవహార ఒప్పందాల్లో మెలకువ వహించండి. స్తోమతకు మించి హామీలివ్వవద్దు. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. సంతానం ద్వారా శుభవార్త వింటారు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. చేతివృత్తులు, కార్మికులకు ఆశాజనకం. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. రవాణా, మార్కెట్ రంగాల వారికి ఆదాయాభివృద్ధి. కాంట్రాక్టులు, ఏజెన్సీలు దక్కించుకుంటారు.