సోమవారం, 2 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వారఫలం
Written By రామన్
Last Modified: శనివారం, 10 ఏప్రియల్ 2021 (23:18 IST)

11-04-2021 నుంచి 17-04-2021 వరకూ మీ వార రాశి ఫలితాలు

మేషం: అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం
వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. మీ నమ్మకం వమ్ము కాదు. పథకాలు రూపొందించుకుంటారు. పెట్టుబడులపై పునరాలోచన మంచిది. ఖర్చులు విపరీతం. ఒక అవసరానికి వుంచిన ధనం మరోదానికి వ్యయం చేస్తారు. పనులు హడావుడిగా సాగుతాయి. ముఖ్యుల సందర్శనం వీలుపడదు. సోమ, మంగళ వారాల్లో ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. అయినవారితో సంప్రదింపులు జరుపుతారు. పెద్దల సలహా పాటించండి. పిల్లల ఉన్నత చదువులను వారి ఇష్టానికే వదిలేయండి. గృహమార్పు చికాకు పరుస్తుంది. పత్రాల రెన్యువల్లో అలక్ష్యం తగదు. మార్కెట్ రంగాల వారికి పురోభివృద్ధి. ఏజెన్సీలు, కాంట్రాక్టులు చేజారిపోతాయి. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు నిరుత్సాహపరుస్తాయి. కార్మికులు, చేతివృత్తుల వారికి సదవకాశాలు లభిస్తాయి.
 
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు
ఆదాయానికి మించిన ఖర్చులుంటాయి. రాబడిపై దృష్టి పెడతారు. ధన సహాయం అర్థించేందుకు మనస్కరించదు. అవసరాలు వాయిదా వేసుకుంటారు. పనులు ప్రారంభంలో ఆటంకాలెదుర్కుంటారు. మీపై శకునాల ప్రభావం అధికం. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. బుధ, గురు వారాల్లో కొత్త వ్యక్తులతో జాగ్రత్త. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. ఆహ్వానం, కీలక పత్రాలు అందుకుంటారు. ఆప్తులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. నిర్మాణాలు, మరమ్మతులు మందకొడిగా సాగుతాయి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. చిరువ్యాపారులకు ఆశాజనకం. ఉద్యోగస్తుల సమర్థతకు ఏమంత గుర్తింపు వుండదు. కొత్తగా వచ్చిన అధికారులకు స్వాగతం పలుకుతారు. జూదాలు, బెట్టింగుల జోలికి పోవద్దు.
 
మిధునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు, 1, 2, 3 పాదాలు
చాకచక్యంగా వ్యవహరించాలి. తప్పటడుగు వేస్తారు. వాగ్వాదాలకు దిగవద్దు. సన్నిహితుల సలహా పాటించండి. ఊహించని ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. కొంతమొత్తం ధనం అందుతుంది. మీ శ్రీమతి విషయంలో దాపరికం తగదు. కీలకపత్రాలు అందుకుంటారు. ఒక సమాచారం ఆలోచింపజేస్తుంది. శుక్ర, శని వారాల్లో ముఖ్యుల కలయిక వీలుపడదు. వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు. గృహమార్పు అనివార్యం. ఆరోగ్యం నిలకడగా వుంటుంది. వేడుకకు హాజరవుతారు. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఉద్యోగులకు యూనియన్ వ్యవహారాలతో తీరిక వుండదు. విద్యార్థులకు ఒత్తిడి అధికం. ప్రైవేట్ విద్యాసంస్థలకు కొత్త సమస్యలెదురవుతాయి. వ్యాపారాలలో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. ప్రేమ వ్యవహారాలు వివాదాస్పదమవుతాయి.
 
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. మాటతీరు ఆకట్టుకుంటుంది. వ్యవహారాలను సమర్థంగా నిర్వహిస్తారు. ఆదాయ వ్యయాలకు పొంతన వుండదు. విలాసాలకు వ్యయం చేస్తారు. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. ఆదివారం నాడు పనులు సాగవు. నగదు, ఆభరణాలు జాగ్రత్త. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. గృహమార్పులు చేపడతారు. సంతానం కదలికలపై దృష్టి సారించండి. చెప్పుడు మాటలు పట్టించుకోవద్దు. ప్రతి విషయం స్వయంగా తెలుసుకోవాలి. ప్రియతముల గురించి ఆందోళన చెందుతారు. పత్రాల రెన్యువల్లో మెలకువ వహించండి. వ్యాపారాల్లో పురోభివృద్ధి, అనుభవం గడిస్తారు. న్యాయ, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి.
 
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ప్రియతములకు సాయం అందిస్తారు. గౌరవ మర్యాదలు పెంపొందుతాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. బాధ్యతగా వ్యవహరించాలి. ఎదుటివారి తీరును గమనించి మెలగండి. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కలిసి వస్తుంది. అయినవారితో సంప్రదింపులు జరుపుతారు. మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. గురు, ఆది వారాల్లో అప్రియమైన వార్తలు వినాల్సి వస్తుంది. ముఖ్యుల కలయిక వీలుపడదు. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. సంతానం విషయంలో శుభఫలితాలున్నాయి. ఉమ్మడి వ్యాపారాలకు అనుకూలం. హోల్‌సేల్ వ్యాపారులకు పురోభివృద్ధి. ఉద్యోగస్తులకు పదవీయోగం. ఉపాధి అవకాశాలు సంతృప్తినిస్తాయి. వేడుకలకు హాజరవుతారు.
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
మీ ఓర్పునకు పరీక్షా సమయం. నిరుత్సాహం వీడి యత్నాలు సాగించండి. సాయం ఆశించవద్దు. త్వరలో పరిస్థితులు చక్కబడతాయి. ఖర్చులు అదుపులో వుండవు. ఉదాయ మార్గాలను అన్వేషిస్తారు. సన్నిహితుల సాయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. పనులు సావకాశంగా పూర్తి చేస్తారు. ఆది, సోమ వారాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. బంధువుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. విమర్శలు, అభియోగాలు పట్టించుకోవద్దు. సంతానం భవిష్యత్తుపై శ్రద్ధ వహించండి. ఆరోగ్యం సంతృప్తికరం. ఆధ్మాత్మికత పట్ల ఆసక్తి నెలకొంటుంది. వ్యాపారాభివృద్ధికి కొత్త పథకాలు చేపడతారు. చేతి వృత్తులు, కార్మికులకు సదవకాశాలు లభిస్తాయి. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసి వస్తాయి. ప్రయాణం ప్రశాంతంగా సాగుతుంది.
 
తుల: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ఆర్థిక లావాదేవీలు ముగుస్తాయి. ఖర్చులు ప్రయోజనకరం. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. రుణ సమస్యలు పరిష్కారమవుతాయి. కొత్త పనులు చేపడతారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. మాటతీరు ఆకట్టుకుంటుంది. ప్రకటనలు, సందేశాలను పట్టించుకోవద్దు. నమ్మకస్తులే మోసగించేందుకు యత్నిస్తారు. మీ శ్రీమతి సలహా పాటించండి. ముఖ్యమైన పత్రాలు అందుతాయి. సన్నిహితుల ముఖ్య సమాచారం అందిస్తారు. ఆశించిన పదవులు దక్కవు. గుట్టుగా వ్యవహరించండి. కుటుంబ విషయాలు ఏకరవు పెట్టొద్దు. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. విశ్రాంతి అవసరం. వ్యాపారాలు ఊపందుకుంటాయి. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. ఉద్యోగస్తులకు ధనప్రలోభం తగదు. కొత్త అధికారులకు స్వాగతం పలుకుతారు. 
 
వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట 1, 2, 3, 4 పాదాలు
ఈ వారం అనుకూలదాయకమే. అభియోగాలు తొలగిపోగలవు. బంధువులు మీ ఔన్నత్యాన్ని గుర్తిస్తారు. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. పదవుల స్వీకరణకు అనుకూలం. ఖర్చులు విపరీతం. ప్రతి వ్యవహారం ధనంతో ముడిపడి వుంటుంది. శుభకార్యం నిశ్చయమవుతుంది. పెట్టిపోతల్లో మెలకువ వహించండి. స్తోమతకు మించి హామీలివ్వవద్దు. పెద్దల సలహా పాటించండి. స్థిరాస్తి క్రయవిక్రయాల్లో పునరాలోచన మంచిది. సంతానం భవిష్యత్తుపై మరింత శ్రద్ధ వహించాలి. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. నిరుద్యోగలకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. ఉద్యోగస్తుల సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. భవన నిర్మాణ కార్మికులు అప్రమత్తంగా వుండాలి. వృత్తుల వారికి ఆశాజనకం. ఆధ్మాత్మికత పెంపొందుతుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.
 
ధనస్సు: మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ 1వ పాదం
వ్యవహార దక్షతతో రాణిస్తారు. రుణ సమస్యలు తొలగుతాయి. రావలసిన ధనం అందుతుంది. మానసికంగా కుదుటపడతారు. పరిచయస్తుల రాకపోకలు అధికమవుతాయి. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. పనులు సానుకూలమవుతాయి. ఖర్చులు అదుపులో వుండవు. మంగళ, బుధ వారాల్లో నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. గృహమార్పు కలిసివస్తుంది. ఆరోగ్యం సంతృప్తికరం. ఉల్లాసంగా గడుపుతారు. కీలక పత్రాలు అందుకుంటారు. దంపతుల మధ్య అవగాహన లోపం. అనునయంగా మెలగండి. పంతాలు, పట్టింపులకు పోవద్దు. వైద్య రంగాల వారికి ఆదాభివృద్ధి, వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. వృత్తి, ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. వేడుకకు హాజరవుతారు. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణం తగదు. 
 
మకరం: ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2, పాదాలు
కార్యక్రమాలు విజయవంతమవుతాయి. మాటతీరు ఆకట్టుకుంటుంది. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. ప్రత్యర్థులతో జాగ్రత్త. గుట్టుగా వ్యవహరించండి. ఖర్చులు అదుపులో వుండవు. ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. సోదరీ సోదరులతో సత్సంబంధాలు నెలకొంటాయి. గురువారం నాడు ప్రముఖుల సందర్శన వీలుపడదు. పనులు సానుకూలతకు మరింత శ్రమించాలి. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం ఆసక్తి కలిగిస్తుంది. ఆత్మీయల సంప్రదింపులు జరుపుతారు. ఉమ్మడి వ్యాపారాలు కలిసి వస్తాయి. చిరువ్యారాలకు ఆశాజనకం. న్యాయ, సాంకేత, రంగాల వారికి ఆదాయాభివృద్ధి. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి, పనిభారం, అధికారలకు హోదా మార్పు. విందులు, వేడుకల్లో అత్యుత్సాహం తగదు.
 
కుంభం: ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. ప్రైవేట్ సంస్థల్లో మదుపు తగదు. శుభకార్యం నిశ్చయమవుతుంది. పెట్టిపోతల్లో మెలకువ వహించండి. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. శుక్ర, శని వారాల్లో పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. విలువైన వస్తువులు జాగ్రత్త. ఆత్మీయులతో సంభాషిస్తారు. గృహంలో మార్పుచేర్పులకు అనుకూలం. పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. పదవులు దక్కకపోవచ్చు. పట్టుదలతో యత్నాలు సాగించండి. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. సంతానం ఉన్నత చదువులను వారి ఇష్టానికే వదిలేయండి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆటంకాలను దీటుగా ఎదుర్కొంటారు. ఉపాధ్యాయులకు ఒత్తిడి, పనిభారం. రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంటుంది. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.
 
మీనం: పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
రాజీమార్గంలో సమస్యలు పరిష్కరించుకోవాలి. అనుభవజ్ఞుల సలహా పాటించండి. ఏ విషయాన్ని తేలికగా తీసుకోవద్దు. ఆదాయం బాగుంటుంది. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. ఆహ్వానం అందుకుంటారు. ఒక సమాచారం తీవ్రంగా ఆలోచింపజేస్తుంది. ఆది, గురు వారాల్లో పనులు మందకొడిగా సాగుతాయి. ముఖ్యుల కలయిక వీలుపడదు. మీ శ్రీమతి సాయంతో ఒక సమ్య సద్దుమణుగుతుంది. బంధువులతో తెగిపోయిన సంబంధాలు బలపడతాయి. కొత్త యత్నాల సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. గుట్టుగా వ్యవహరించండి. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. ఉద్యోగస్తుల సమర్థతకు గుర్తింపు. అధికారులు, సహోద్యోగల ప్రశంసలు అందుకుంటారు. ఉమ్మడి వ్యాపారాలు కలిసి వస్తాయి. కంప్యూటర్, సాంకేత రంగాల వారికి చికాకులు అధికం.