శుక్రవారం, 29 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 24 జూన్ 2022 (10:45 IST)

తెల్లమద్ది.. అర్జున పత్రి.. కొవ్వు మటాష్.. అందానికి బెస్ట్

Arjuna _Tella Maddi
Arjuna _Tella Maddi
తెల్ల మద్దిని ఆయుర్వేదంలో ఔషధంగా విస్తృతంగా ఉపయోగిస్తారు. దీనిని అర్జున పత్రి అని కూడా అంటారు. ఈ బెరడు కాలేయంలో ఎల్‌డిఎల్-కొలెస్ట్రాల్ యొక్క టర్నోవర్‌ను వేగవంతం చేయడం ద్వారా కొలెస్ట్రాల్ నిర్మూలనను పెంపొందిస్తుంది. బీటా-లిపోప్రొటీన్ లిపిడ్‌లను తగ్గిస్తుంది. 
 
గుండె కండరాలను బలోపేతం చేస్తుంది. గుండె పనితీరును సక్రమంగా నిర్వహిస్తుంది. హైపర్ టెన్షన్‍‌కు చెక్ పెడుతుంది. ముఖ్యంగా కొలెస్ట్రాల్‌ను 64% వరకు తగ్గించడంలో అర్జున సహాయపడగలదు.
 
అర్జున బెరడుని పాలలో కాచి వచ్చిన డికాక్షన్ ను ఉదయం పూట పరగడుపున తాగితే గుండె జబ్బుల వారికి ఉపశమనంగా ఉంటుంది.
 
అర్జునని ఆస్తమా ఉన్నవారిలో కూడా ఉపయోగించుకోవచ్చు. బెరడును బాగా మెత్తగా నూరి చూర్ణంగా చేసి పాయసంలో పైన 10 గ్రాములు జల్లి, దానిని తింటే ఆస్తమా తగ్గుతుంది.
 
అర్జున బెరడు నుంచి తయారుచేసిన చూర్ణమును తేనెతో తీసుకుంటే విరిగిన ఎముకలు త్వరగా అతుక్కుంటాయి.
 
నడి వయసు స్త్రీలలో వచ్చే ఆస్టియో ప్లోరోసిస్ అనే సమస్యకు కూడా ఇది బాగా ఉపకరిస్తుంది. అర్జునలో ఉన్న నేచురల్ కాల్షియం వలన ఈ ఉపయోగాలున్నాయి. 
 
ముఖంపై మొటిమలు ఉన్న అమ్మాయిలు మద్ది చెట్టు బెరడు నుంచి చేసిన చూర్ణాన్ని తేనెలో కలిపి ముఖంపై రాసుకుంటే త్వరగా తగ్గుతాయని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు. 
 
అర్జున పత్రిని తీసుకోవాల్సిన మోతాదు :
పొడి : 3-6 గ్రాములు రోజుకు రెండు లేదా మూడు సార్లు పాలు లేదా నీటితో కలిపి తీసుకోవాలి.
 
అర్జున రసం : 10-20 మి.లీ. పంచదార లేదా తేనె లేదా పాలతో రోజుకు రెండు లేదా మూడు సార్లు తీసుకోవాలి.
 
కషాయం : 20-40 మి.లీ. 1:2 గాఢతలో రోజుకు రెండుసార్లు.