1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By Selvi
Last Updated : గురువారం, 22 జనవరి 2015 (17:10 IST)

ఏలకుల్లో ఏముందో తెలుసా..?

ఏలకుల్లో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. జలుబుతో బాధపడుతుంటే ఏలకులు మంచి దివ్యౌషధంగా పనికొస్తాయి. ఏలకులను నమిలితే పొడిదగ్గు, జలుబు తగ్గిపోతాయి.

జీర్ణావయవాల్లో ఏర్పడే రుగ్మతలే నోటి దుర్వాసనకు కారణం అవుతుంది. నోటి దుర్వాసనను దూరం చేసుకోవాలంటే ఏలకులను నమిలి తినేస్తే సరిపోతుంది. ఆహార పదార్థాల్లో ఏలకులు చేర్చడం మంచిది. అయితే ఇది మోతాదు మించకూడదు.
 
ఏలకుల్లోని వాలట్టైల్ అనే నూనె వాసనతో పాటు రోగాలను దూరం చేయడంలో ఔషధంగా పనిచేస్తుంది. ఇందులోని కారం ఉదరంలోని రుగ్మతలను దూరం చేసి జీర్ణవ్యవస్థను సాఫీగా ఉంచుతుంది. ఏలకుల టీ, పాయసంలో ఉపయోగించడం ద్వారా కొత్త ఉత్సాహం చేకూరుతుంది. 
 
తేమ, పీచు, పిండి, క్యాల్షియం, ఫాస్పరస్, ఐరన్ కలిగివుంటాయి. సంతాన లేమికి ఏలకులు దివ్యౌషధంగా పనిచేస్తుంది. అజీర్తిని దూరం చేసుకోవాలంటే.. ఏలకులు చేర్చిన ఓ కప్పు టీని తాగితే సరిపోతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.