1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By Selvi
Last Updated : మంగళవారం, 16 జూన్ 2015 (17:53 IST)

నీటిలో ఇంగువను కరిగించి తీసుకుంటే మైగ్రేన్ తలనొప్పి హుష్ కాకి!

మైగ్రేన్ తలనొప్పికి చెక్ పెట్టాలా? అయితే నీటిలో ఇంగువను కరిగించి తీసుకుంటే సరిపోతుందని, ఇలా చేస్తే మైగ్రేన్ తలనొప్పి మాత్రమే గాకుండా సాధారణ తలనొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. అలాగే నిమ్మరసం కలిపిన చిన్న ఇంగువ ముక్క పంటి నొప్పికి బాగా పనిచేస్తుంది. అజీర్తి మెరుగ్గా పనిచేసే ఇంగువకు కడుపు మంటను తగ్గించే గుణం ఉంది.
 
యాంటిఆక్సిడెంట్ లక్షణాలు ఇంగువలో ఉన్నాయి. చికాకు పెట్టే కడుపు, పేగులో వాయువు, పేగు పురుగులు, అపానవాయువు, చికాకుపెట్టే పేగు వ్యాధి (ఐ బి ఎస్) మొదలైన అజీర్తి లక్షణాలను తగ్గించడంలో ఇంగువ సహాయం చేస్తుంది. ఒక అరకప్పు నీటిలో చిన్న చిన్న కొన్ని ఇంగువ ముక్కలను కరగించి తీసుకొంటే అజీర్తి, ఋతుసమస్య నుండి వెంటనే ఉపశమనం కలుగుతుంది. 
 
అలాగే రుతుసమస్యల నుంచి ఉపశమనం లభించాలంటే.. ఇంగువను పంటి మీద పడకుండా మింగేసి నీళ్లు తాగేస్తే సరిపోతుంది. ఇంకా ఇంగువ శ్వాసకోశ వ్యాధులన్ని తగ్గిస్తుంది. తేనె, అల్లంతో కూడిన ఇంగువను తీసుకుంటే దీర్ఘకాల౦గా ఉన్న పొడి దగ్గు, కోరింత దగ్గు, శ్వాస నాళముల వాపు, ఉబ్బసం వంటి శ్వాస సంబంధ వ్యాధుల నుండి ఉపశమనం పొందవచ్చు. ఇంగువ నరాలను ఉత్తేజపరచడం ద్వారా మూర్ఛ వంటి నాడీ సంబంధిత వ్యాధులను దూరం చేసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.