Daily Horoscope
✕

గర్భంతో వున్న మహిళ ఏయే పండ్లను తీసుకోరాదు, పుచ్చకాయ తినొచ్చా?

Written By సిహెచ్
Updated: గురువారం, 25 ఫిబ్రవరి 2021 (20:57 IST)
గర్భధారణ సమయంలో నివారించాల్సిన పండ్లు కొన్ని వున్నాయి. వాటిలో బొప్పాయి అగ్రస్థానంలో వుంటుంది. పలు స్పష్టమైన కారణాల వల్ల ఈ పండును తినరాదని చెపుతారు. అలాగే పైనాపిల్ గర్భిణీ స్త్రీలు అకాల సంకోచాలను ప్రేరేపించే గర్భాశయ ఆకృతిని మార్చే కొన్ని ఎంజైమ్‌లను కలిగి ఉన్నందున దీనిని కూడా సిఫార్సు చేయరు. ద్రాక్ష పండ్లను కూడ తినకూడదని చెపుతారు.
 
ఐతే గర్భధారణ సమయంలో పుచ్చకాయ తినడం సాధారణంగా సురక్షితంగా భావిస్తారు. ఈ పండు మితంగా పిండి పదార్థాలు, తక్కువ ఫైబర్ కలిగి ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను పెంచడానికి కారణమవుతుంది.
 
మధుమేహం వున్నవారు తినవచ్చా?
మధుమేహం వున్నవారు ప్రతిరోజూ తమతమ గ్లూకోజ్ స్థాయిలను చెక్ చేసుకుంటూ వుంటారు. చాలామంది భోజనంలో కొన్ని తీపి వంటకాలను తినాలని అనుకున్నా ఇలాగే చెక్ చేసుకుంటూ వుంటారు. కనుక పుచ్చకాయ విషయంలోనూ అంతే. ఐతే పుచ్చకాయలో ఎంత మోతాదు చక్కెర వుంటుందో తెలుసుకోవాలి.
 
డయాబెటిస్ ఉంటే రక్తంలో చక్కెర స్థాయిలను పర్యవేక్షించడం ఎంత ముఖ్యమో తెలుసు. పుచ్చకాయలో సహజ చక్కెరలు ఉంటాయి. మొత్తం ఆహారం, పుచ్చకాయ మొత్తాన్ని బట్టి, ఇది రక్తంలో చక్కెర స్థాయిపై ప్రభావం చూపుతుంది.
పుచ్చకాయ వల్ల ఆరోగ్య ప్రయోజనాలు
విటమిన్ ఎ, విటమిన్ సి, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ బి- 6, ఫైబర్, ఇనుము, కాల్షియం వున్నాయి. విటమిన్ ఎ ఆరోగ్యకరమైన దృష్టికి మేలు చేస్తుంది. గుండె, మూత్రపిండాలు మరియు ఊపిరితిత్తుల నిర్వహణలో సహాయపడుతుంది.
 
విటమిన్ సి పుచ్చకాయలో లభిస్తుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కొన్ని క్యాన్సర్ల నివారణకు సహాయం చేస్తుంది. జలుబు దరిచేరకుండా సాయపడుతుంది. ఇందులో ఫైబర్ అధికంగా ఉన్నందున, పుచ్చకాయ తినడం వల్ల మంచి జీర్ణ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. మితమైన పుచ్చకాయ తినడం వల్ల ఆ కాయను తినాలన్న కోర్కె తీర్చుకోవచ్చు. అయితే అపరిమితంగా తింటే అనర్థం.

అన్నీ చూడండి

రూ.2లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడిన సబ్ ఇన్స్‌స్పెక్టర్

Ban Rs. 500 Notes? I 500 రూపాయల నోట్ల ఉపసంహరణపై స్పందించిన ఏపీ సీఎం బాబు

పవన్ కల్యాణ్, అన్నా కొణిదెల విడిపోయారు.. ఫ్యాన్స్‌కు షాక్

ఆన్‌లైన్‌లో తితిదే క్యాలెండర్లు - డైరీలు విక్రయం

ఎన్వీడియా చీఫ్‌పై గూఢచర్యం ఆరోపణలు - మా దేశంపై కుట్ర : చైనా ధ్వజం

అన్నీ చూడండి

Aadi Saikumar: ఈగో రాజా నుంచి రౌడీ రాకాసి అంటూ సాగే లవ్ సాంగ్ రిలీజ్

Nayanthara and Ram: రజనీకాంత్, కమల్ హాసన్, ధర్మన్ లో నయనతార, రామ్ పోతినేని లుక్స్

Pawan Kalyan and Sreeja :అందుకే పవన్ కళ్యాణ్ విడిపోయారు - బాబాయ్ బాటలో అమ్మాయి కూడా ? : వేణుస్వామి

Pawan Kalyan and Anna diverced: పుకార్లకు ఫుల్ స్టాప్ పెడుతూ పవన్ కళ్యాణ్, అన్నా కొనిడాల విడిపోతున్నట్లు ప్రకటన

Imanvi Ismail and Prabhas :ఫౌజీ చిత్రం కోసం రొమాంటిక్ పెళ్లి సన్నివేశం చిత్రీకరణ !

తర్వాతి కథనం
Show comments