శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 12 అక్టోబరు 2020 (22:06 IST)

ఈ పాత్రలలో అలాంటి పదార్థాలు వండితే అనారోగ్యాన్ని కొనితెచ్చుకున్నట్లే...

కొన్ని లోహాలతో చేసే పాత్రలలో వంట చేయడం ఆరోగ్యానికి ప్రమాదకరమని మీకు తెలుసా? మీకు ఇష్టమైన వంటకం ఉడికించే పాత్ర మీ ఆరోగ్యానికి మంచిదా కాదా? మీ కుటుంబానికి పోషకాలు అధికంగా మరియు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడం మీ ప్రాధాన్యత జాబితాలో ఉంటే, మీరు ఉడికించడానికి ఉపయోగించే చాలా పాత్రలు ఆరోగ్యానికి మంచివి అవునో కాదో తెలుసుకోవాల్సిందే.
 
రాగి పాత్రలు తరచుగా వండటానికి మరియు వడ్డించడానికి ఆరోగ్యకరమైన ఎంపికగా భావిస్తారు. ఆహారం యొక్క వెచ్చదనాన్ని ఎక్కువసేపు నిలుపుకునే నాణ్యత రాగికి ఉంది. ఐతే, రాగి పాత్రలో ఉప్పగా ఉండే ఆహారాన్ని వండటం మంచిది కాదు. ఎందుకంటే ఉప్పులో ఉన్న అయోడిన్ త్వరగా రాగితో స్పందిస్తుంది, ఇది ఎక్కువ రాగి కణాలను విడుదల చేస్తుంది. అందువల్ల, అటువంటి పాత్రలలో వంట చేయాలనుకున్నప్పుడు ఉప్పు కంటెంట్ లేనివి ఎంచుకుని చేయాలి.
 
అల్యూమినియం చాలా సాధారణంగా ఉపయోగించే మరొక పాత్ర. అల్యూమినియం చాలా త్వరగా వేడి అవుతుంది. ఆమ్లాల్ని కలిగి వున్న కూరగాయలు, ఆహారాలతో ఇది సులభంగా స్పందిస్తుంది. కాబట్టి అలాంటి పాత్రలలో వంట చేయకుండా ఉండటం మంచిది. ఈ రసాయన ప్రతిచర్యలు రోగనిరోధక శక్తిని ప్రభావితం చేస్తాయి.
 
ఇత్తడి వంట పాత్రలలో వంట చేయడం, తినడం ఆరోగ్యానికి మేలు చేస్తుందనేది సాధారణ నమ్మకం. అయితే, వంటతో పోలిస్తే ఇత్తడి పాత్రలో తినడం అంత హానికరం కాదు. ఇత్తడి వేడి చేసినప్పుడు ఉప్పు, ఆమ్ల ఆహారాలతో సులభంగా స్పందిస్తుంది. అందువల్ల, అలాంటి పాత్రలలో వంట చేయడం మానుకోవాలి.
 
స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలు సాధారణంగా ఉపయోగించే వంటసామానులలో ఒకటి. కానీ చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే స్టెయిన్లెస్ స్టీల్ ఒక లోహ మిశ్రమం, ఇది క్రోమియం, నికెల్, సిలికాన్, కార్బన్ మిశ్రమం. అయినప్పటికీ, స్టెయిన్లెస్ స్టీల్ యాసిడ్ ఆహారాలతో స్పందించదు. మీరు స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలను కొనాలనుకున్నప్పుడు, నాణ్యతను తనిఖీ చేయండి ఎందుకంటే ఇది లోహాలను కలపడం ద్వారా సృష్టించబడుతుంది. ఇది సరైన స్టీల్ కాకపోతే ఆరోగ్యానికి హానికరం. కాబట్టి, ఎల్లప్పుడూ అధిక నాణ్యత, మన్నికైన స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలనే ఎంచుకోవాలి.
 
ఇతర పాత్రల మాదిరిగా కాకుండా, ఐరన్ వంట సామగ్రి మంచిదని చెప్పవచ్చు. ఇది సహజంగా ఇనుమును విడుదల చేస్తుంది కాబట్టి ఇది శరీరం యొక్క మంచి పనితీరుకు అవసరం. వాస్తవానికి, ఇనుప పాత్రలలో వంట చేసే సాంప్రదాయిక మార్గం. ఇవి ఆరోగ్యానికి మంచిదని కొన్ని అధ్యయనాలు రుజువు చేశాయి. ఎందుకంటే ఇది గర్భంలో శిశువు అభివృద్ధి చెందడానికి అవసరమైన పోషకాలను ఉత్తమంగా అందిస్తుంది.