లాక్‌డౌన్ 4.0లో మరిన్ని సడలింపులు ఉండచ్చని, జోన్లపై నిర్ణయాధికారం రాష్ట్ర ప్రభుత్వాలకే ఉంటుందని ఈనాడు కథనం ప్రచురించింది. లాక్‌డౌన్ గడువు ఆదివారంతో ముగుస్తున్న నేపథ్యంలో సోమవారం నుంచి ఎలాంటి నిబంధనలు అమల్లోకి వస్తాయన్న ఉత్కంఠ అందరిలో వ్యక్తమవుతోంది. భవిష్యత్తు కార్యాచరణపై ఈనెల 11న ముఖ్యమంత్రులతో మాట్లాడిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ, అన్ని రాష్ట్రాలు బ్లూప్రింట్స్ పంపాలని సూచించారు. దానికి గడువు శుక్రవారంతో ముగిసింది. అందిన సూచనలు ఆధారంగా కేంద్రం నిర్ణయం...