Daily Horoscope
✕

ఉసిరికాయ పొడి.. నీటిలో కలిపి ఇనుప పాత్రలో నానబెట్టి?

ఉసిరికాయను ఎండబెట్టి పొడి చేసుకుని తలకు పట్టించవచ్చు. ఇనుప పాత్రలో ఉసిరికాయ పొడి, తగినంత నీరు పోసి ఒక గంట నాననివ్వాలి. దీంతో తలకు రుద్దుకుంటే షాంపూగానూ, కండిషనర్‌గానూ ఉపయోగపడుతుంది. ఇలా చేస్తే తెల్లజు

Written By selvi
Updated: శనివారం, 17 ఫిబ్రవరి 2018 (17:13 IST)
ఉసిరికాయను ఎండబెట్టి పొడి చేసుకుని తలకు పట్టించవచ్చు. ఇనుప పాత్రలో ఉసిరికాయ పొడి, తగినంత నీరు పోసి ఒక గంట నాననివ్వాలి. దీంతో తలకు రుద్దుకుంటే షాంపూగానూ, కండిషనర్‌గానూ ఉపయోగపడుతుంది. ఇలా చేస్తే తెల్లజుట్టు బ్రౌన్‌గా మారుతుంది. 
 
ఇంకా జుట్టు రంగు మారదు. అలాగే జుట్టు రాలడం, తెల్లబడటం, పొడిబారడం, చిట్లి పోవడం వంటి సమస్యలకు, చుండ్రుని నివారించేందుకు హెన్నాలో ఆమ్లా పౌడర్‌ని కలిపి తలకు పట్టించాలి. ఆమ్లా పౌడర్ దొరకని పక్షంలో ఉసిరి కాయలను గింజలు తీసి మెత్తగా గ్రైండ్ చేసి హెన్నాలో కలుపుకోవాలి. అలాగే ఉసిరికాయ రసం సహజసిద్ధమైన ఆస్ట్రింజెంట్. ఈ రసంలో దూదిని అద్ది ముఖాన్ని తుడిస్తే.. కాలుష్యం, జిడ్డు వదిలి చర్మం శుభ్రం కావడంతో పాటు మెరిసిపోతుంది. 
 
ఇంట్లోనే బ్యూటీ క్రీములు తయారీ ఎలా?
గులాబీలు సౌందర్యానికి ఎంతో మేలు చేస్తున్నాయి. అలాంటి గులాబీలతో క్రీమ్‌ను ఇంట్లోనే చేసుకోవచ్చు. నాలుగు టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్, బాగా వాసన వెదజల్లే గులాబీ రేకులు రెండు కప్పులు, తేనె మైనం ఒక టేబుల్ స్పూన్, వర్షం నీరు లేదా శుభ్రమైన నీటిని తీసుకోవాలి. ఆలివ్ ఆయిల్‌‌ను మరిగే స్థాయి వరకు వేడి చేసి అందులో గులాబీ రేకులు వేయాలి. 
 
దీనిని సీసాలోకి తీసుకుని సుమారు వారం రోజులు ఉంచాలి. ఇలా నూనెలో గులాబీలు బాగా కలిశాక.. వడపోసి గులాబీ రేకులను వేరు చేసుకోవాలి. హనీ వ్యాక్స్‌ను ఒక పాత్రలోకి తీసుకునే కరిగే వరకు వేడి చేసి.. ఆలివ్ నూనెలో కలిపి చల్లబరచాలి. చివరిగా ఒకటి లేదా రెండు స్పూన్ల నీటిని చేర్చి భద్రపరుచుకోవాలి. ఈ మిశ్రమాన్ని నాలుగు నెలల పాటు వాడుకోవచ్చు.

అన్నీ చూడండి

ఏపీ స్థానిక పోరు : విజయవాడలో గుర్తులు తారుమారు... ఓటేసిన ప్రముఖులు

ప్రియురాలు దూరం పెట్టిందని చాకుతో పొడిసి చంపేసిన ప్రియుడు

నేడు ఢిల్లీలో ఇండియా కూటమి ఛలో ఢిల్లీ.. ట్రాఫిక్ ఆంక్షలు కఠినతరం

ఏపీలో పుర పోరు.. పోలింగ్‌ ప్రారంభం - పులివెందులలో టెన్షన్ టెన్షన్

Weather forecast.. నవంబర్ 1, 2026.. తెలుగు రాష్ట్రాల వాతావరణం ఎలా వుందంటే?

అన్నీ చూడండి

విశ్వక్ సేన్, తరుణ్ భాస్కర్ ల సీక్వెల్ ఈ నగరానికి ఏమైంది రిపీట్ ట్రైలర్ రాబోతోంది

నువ్వు విలన్ వి ? చనిపోతావా? ఓడిపోతావా? అని నిలదీశిన యశ్ కుమారుడు

Rudravanam PS Series Review: రుద్రవనం పీఎస్ లో మర్డర్ల రహస్యం ఏమిటి? వెబ్ సిరీస్ రివ్యూ

Prakash Raj, ఇచ్చిన సినీ అడ్వాన్సులు వెనక్కి తీస్కుంటున్నారు: ప్రకాష్ రాజ్ భార్య పోనీ

జయంత్ అండ్ ది జింగో పెన్ చిత్రం తారే జమీన్ పర్ లా సక్సెస్ అవ్వాలి

తర్వాతి కథనం
Show comments