బాదం నూనెతో ముఖానికి మెరుపు...!

శుక్రవారం, 6 మే 2016 (13:51 IST)
బాదం నూనెలో ఎ, ఇ విటమిన్లు ఉంటాయి.బాదం నూనె మృతకణాల్ని తొలగించడంలో సాయపడుతుంది. సమపాళ్లలో బాదం, కొబ్బరినూనె కలిపి నల్లటి వలయాలపై రాస్తే కొద్ది రోజులకు అవి మాయమవుతాయి. 
* ప్రతి రోజూ రాత్రి పడుకునే ముందు బాదం నూనె ముఖానికి రాస్తుంటే చర్మం మెరిసిపోతుంది. పావుగంట పాటు బాదం నూనెని ముఖానికి మర్దన చేశాక గంధంతో ఫేస్‌ప్యాక్ వేస్తే ముఖానికి అదనపు సొగసు చేరుతుంది.
* రెండు చెంచాల బాదం నూనెలో చెంచా నిమ్మరసం వేయాలి. దీన్ని ముఖానికి ప్యాక్‌లా వేసి అరగంట తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేస్తే ముఖం మెరిసిపోతుంది. బాదం, ఆముదం నూనె మిశ్రమం జుట్టు పెరగడంలో సాయపడుతుంది. నాలుగు చెంచాల బాదం నూనెలో మూడు చెంచాల ఆముదం వేసి బాగా కలపాలి. దీన్ని జుట్టుకు రాసి శుభ్రమైన వస్త్రంతో చుట్టేయాలి. అరగంటయ్యాక షాంపూతో కడిగేస్తే జుట్టు అందంగా త‌యార‌వుతుంది.
*అరచెంచా చొప్పున బాదంనూనె, తేనె తీసుకుని మిశ్రమంలా చేసి నిద్రపోయే ముందు నల్లటి వలయాలపై రాస్తే చక్కటి ఫలితం ఉంటుంది. ఆముదం, బాదం నూనె మిశ్రమాన్ని నల్లగా మారిన పెదాలపై తరచూ రాస్తే అవి గులాబీ రంగులోకి మారతాయి.
* సమపాళ్లలో బాదంనూనె, తేనె మిశ్రమాన్ని తీసుకుని ముఖానికి రాస్తే మృదువైన చర్మం మీ సొంతమవుతుంది. చెంచా చొప్పున బాదంనూనె, చక్కెర‌ తీసుకుని కలపి, దాన్ని వేళ్లతో తీసుకుని ముఖంపై వలయాకారంగా పది నిమిషాల పాటు రుద్దాలి. పది నిమిషాల తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేయ‌డం వల్ల మృతకణాలు తొలగిపోయి ముఖం శుభ్రంగా మారుతుంది.

అన్నీ చూడండి

జూలై 5న భోగాపురం ఎయిర్ పోర్టు ప్రారంభానికి సన్నాహాలు

నన్ను ఓడించలేకపోతే పేరు మార్చుకుంటానని ఒకాయ అన్నాడు, అలా ఏ కులం వారైనా అంటారా? ముద్రగడకు పవన్ స్ట్రాంగ్ కౌంటర్

TGSRTC: 60 ఎలక్ట్రిక్ బస్సుల్ని రంగంలోకి దించనున్న టీజీఎస్సార్టీసీ

ప్రమాదంలో గాయపడిన మహిళా కానిస్టేబుల్‌ను రక్షించిన బీహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్

సైన్యంలో చేరితే రూ.1.33 కోట్ల రుణం నుంచి విముక్తి కల్పిస్తాం : వ్లాదిమిర్ పుతిన్

అన్నీ చూడండి

'దేశీ ప్రిన్సెస్‌'లా మెరిసిపోతున్న జాన్వీ కపూర్

Nani: 150 మిలియన్+ వ్యూస్ తో నాని ది ప్యారడైజ్ ఆయా షేర్ సాంగ్

Devi Sri Prasad: ఎల్లమ్మ చేయడానికి స్ఫూర్తిని ఇచ్చిన గ్రామం వెదురుపాక: దేవిశ్రీ ప్రసాద్

Karthi: ఈ ఏడాది చిత్రాల సందడితో 49వ పుట్టినరోజు జరుపుకుంటున్న కార్తి

కెమెరాతో కథ చెప్పాలి, రీ-రికార్డింగ్‌కి కూడా కథలో స్పేస్ ఉండాలి : కెమెరామెన్ రత్నవేలు

తర్వాతి కథనం
Show comments