శనివారం, 26 ఏప్రియల్ 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Selvi
Last Updated : శుక్రవారం, 1 జులై 2016 (16:14 IST)

మజ్జిగతో చర్మానికి ఎంతో మేలు.. ఒళ్లంతా రాసుకుని స్నానం చేస్తే?

మజ్జిగ ఆరోగ్యానికే కాదు.. చర్మానికీ ఎంతో మేలు చేస్తుంది. మజ్జిగలో కెలోరీల సంఖ్య చాలా తక్కువ. ఇందులో వ్యాధినిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. జలుబు, దగ్గును దరిచేరనీయకుండా చేయడంలో మజ్జిగ దివ్యౌషధంగా పనిచేస

మజ్జిగ ఆరోగ్యానికే కాదు.. చర్మానికీ ఎంతో మేలు చేస్తుంది. మజ్జిగలో కెలోరీల సంఖ్య చాలా తక్కువ. ఇందులో వ్యాధినిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. జలుబు, దగ్గును దరిచేరనీయకుండా చేయడంలో మజ్జిగ దివ్యౌషధంగా పనిచేస్తుంది. అలాంటి మజ్జిగతో చర్మసౌందర్యాన్ని ఎలా పెంపొందించుకోవాలో చూద్దాం.. గొంతుమంటను నివారించడంలో మజ్జిగ భేష్‌గా పనిచేస్తుంది. 
 
ఇంకా బరువును తగ్గించడంలోనూ ఉపకరిస్తుంది. అలాంటి మజ్జిగను మాడుకు పట్టించి 20 నిమిషాల తర్వాత స్నానం చేస్తే మృదువైన కురులు మీ సొంతం అవుతాయి. అలాగే మజ్జిగను చర్మానికి రాసుకుని అరగంట తర్వాత స్నానం చేస్తే.. చర్మ సమస్యలు దూరం కావడంతో పాటు మృదువైన, నిగనిగలాడే చర్మం మీకు లభిస్తుంది. వారానికోసారి మజ్జిగను చర్మానికి రాసుకుని స్నానం చేస్తే చర్మ సౌందర్యం పెంపొందుతుందని బ్యూటీషన్లు అంటున్నారు.