పెరుగుతో సమ్మర్ బ్యూటీ చిట్కాలు...

ప్రతిరోజూ ఆహారంలో భాగంగా తీసుకునే పెరుగు, మజ్జిగలో ఎన్నోరకాల పోషక విలువలు దాగున్నాయి. అవి ఆరోగ్యంతోపాటు అందాన్నికూడా ఇస్తాయి. పెరుగులో నిమ్మరసం కలిపి ముఖానికి, మెడకు, చేతులకు పట్టించి 20 నిమిషాల తరువా

శుక్రవారం, 8 జూన్ 2018 (14:20 IST)
ప్రతిరోజూ ఆహారంలో భాగంగా తీసుకునే పెరుగు, మజ్జిగలో ఎన్నోరకాల పోషక విలువలు దాగున్నాయి. అవి ఆరోగ్యంతోపాటు అందాన్నికూడా ఇస్తాయి. పెరుగులో నిమ్మరసం కలిపి ముఖానికి, మెడకు, చేతులకు పట్టించి 20 నిమిషాల తరువాత చల్లని నీటితో కడిగితే శరీరం, చర్మం మృదువుగా కాంతివంతంగా మారుతుంది.
 
తలస్నానం చేసేందుకు ఒక గంట ముందుగా తలకు పెరుగును బాగా పట్టించి తలస్నానం చేసుకుంటే కండీషనర్ వాడవలసిన అవసరం ఉండదు. అలాగే పెరుగులో తేనెను కలిపి పూసినా చక్కని కండీషనర్‌లా ఉపయోగపడుతుంది. 
 
పెరుగులో శనగపిండిని కలిపి ముఖానికి, చర్మానికి రాసుకుని 20 నిమిషాల తరువాత కడుక్కుంటే మృతుకణాలు తొలగిపోతాయి. ముల్తానీ మట్టిలో పెరుగును కలిపి, శరీరమంతటా అప్లై చేస్తే అది క్లెన్సింగ్ ఏజెంటులా పనిచేస్తుంది. పెరుగులో కాస్తంత చక్కెరగానీ లేదా ఉప్మా రవ్వగానీ వేసి బాగా కలుపుకుని ముఖానికి పట్టించి మసాజ్ చేస్తే చర్మం అందంగా మారుతుంది.
 
పెరుగులో కాస్త పచ్చి పసుపును వేసి కళ్లచుట్టూ ఉండే నల్లటి వలయాలపై రాస్తే నలుపుదనం తగ్గుతుంది. ఎండలో బయటకు వెళ్లొచ్చినప్పుడు పెరుగులో ఐస్‌క్యూబ్స్ వేసుకుని ఆ మిశ్రమంతో ముఖానకి మసాజ్ చేస్తే ఎండకు కమిలిన చర్మానికి ఉపశమనం లభిస్తుంది.

అన్నీ చూడండి

వంటగదిలో ప్రమాదానికి గురైన వధువు, ఆస్పత్రిలో పెళ్లి చేసుకున్న వరుడు, వీడియో

భగీరథ్‌ను పోలీసులకు అప్పగించాం.. కేంద్ర మంత్రి బండి సంజయ్

వావ్, క్యాంపస్ సెలక్షన్స్‌లో విజయవాడ విద్యార్థినికి రూ. 48 లక్షల ప్యాకేజీ

సీన్ రివర్స్: ప్రియుడు డబ్బులివ్వలేదు.. భర్త సాయంతో చంపి డ్రమ్ములో కుక్కి డ్రైన్‌లో పడేసింది

బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు : బాధితురాలి వాంగ్మూలం నమోదు

అన్నీ చూడండి

నన్ను ఒక్కరు కూడా పట్టించుకోలేదు, నా ఇగో హర్ట్ అయ్యింది: రజినీకాంత్

Kenisha: జయం రవి, గాయని కెనీషా మధ్య రిలేషన్‌షిప్‌ కట్

Nag Aswin: సింగీతం గారి స్టయిల్ లో సింగ్ గీతం ఫన్ సినిమా :నాగ్ అశ్విన్

Regina Cassandra: ప్రేమ, ద్రోహం, ప్రతీకారంతో నిండిన కథగా మరీచిక ట్రైలర్

చిరంజీవి, పవన్ కళ్యాణ్ తో సహా 350కి పైగా టైటిల్స్‌ని డిజైన్ చేశా : పురుష: దర్శకుడు వీరు వులవల

తర్వాతి కథనం
Show comments