Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

విటమిన్ ఇ టాబ్లెట్‌తో ఇలా చేస్తే..?

Updated: బుధవారం, 19 డిశెంబరు 2018 (15:49 IST)
కొందరైతే చూడడానికి చాలా అందంగా, ఫ్యాషన్‌గా ఉంటారు. కానీ, వారి గోర్లు చూస్తే మాత్రం శుభ్రంగా ఉండవు. ముఖం చర్మం అందంగా ఉంటే సరిపోదు. శరీరంలోని అన్ని భాగాలు ఆరోగ్యంగా, అందంగా ఉండాలి. అప్పుడే ఎలాంటి సమస్యలు ఎదుర్కోకుండా ఉంటాం. మరి అందుకు ఏం చేయాలో తెలుసుకుందాం.
 
1. విటమిన్ ఇ టాబ్లెట్ అందరికి తెలిసే ఉంటుంది. కాబట్టి.. ఆ మాత్ర మధ్యలో సూదితో ఓ చిన్న రంధ్రాన్ని వేసి దాని నుండి వచ్చే మిశ్రమాన్ని గోర్లకు రాసుకుని టూత్ బ్రష్‌తో రుద్దుకోవాలి. 20 నిమిషాల తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా తరచు చేస్తే తప్పకుండా గోర్లు తెల్లగా మారుతాయి. 
 
2. ఓ చిన్న బౌల్ తీసుకుని అందులో స్పూన్ తేనె కొద్దిగా ఉప్పు తరువాత విటమిన్ ఇ టాబ్లెట్ మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని చేతి వేళ్లకు రాసుకోవాలి. అరగంట తరువాత నీటితో కడుక్కోవాలి. ఇలా చేస్తే నల్లగా ఉన్న చేతివేళ్లు మృదువుగా, తెల్లగా తయారవుతాయి. 
 
3. కలబంద గుజ్జులో విటమిన్ ఇ టాబ్లెట్ మిశ్రమాన్ని కలిపి ముఖానికి రాసుకోవాలి. 30 నిమిషాల పాటు అలానే ఉంచి ఆ తరువాత శుభ్రం చేసుకోవాలి. ఇలా రోజూ చేస్తే ముఖంపై గల మొటిమలు తొలగిపోతాయి. దాంతో ముఖం ప్రకాశావంతంగా మారుతుంది.
 
4. రెండు స్పూన్ల కాఫీ పొడిలో విటమిన్ ఇ టాబ్లెట్ మిశ్రమాన్ని కలిపి పేస్ట్‌లా ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. 15 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారంపాటు చేస్తే ముఖం కాంతివంతంగా, మృదువుగా ఉంటుంది.
 
5. చలికాలంలో చాలామందికి పెదాలు పొడిబారుతుంటాయి. అలాంటప్పుడు.. విటమిన్ ఇ టాబ్లెట్ ద్వారా వచ్చే మిశ్రమాన్ని పెదాలకు రాసుకోవాలి. ఆ తరువాత చేతివేళ్లతో బాగా మర్దన చేసుకోవాలి. ఆపై 45 నిమిషాల పాటు అలానే ఉంచి.. తరువాత శుభ్రం చేసుకుని ఫలితాలు పొందవచ్చును. 

అన్నీ చూడండి

విమానం గాల్లో ఎగురుతూ వుండగా భారతీయుడికి ఆస్తమా, కన్నుమూత

సీబీఎస్ఈ బాస్కెట్‌బాల్ ఛాంపియన్‌షిప్ గెలుచుకున్న ఎస్వీఐఎస్ అండర్-14 బాలుర జట్టు

వందేభారత్ రైలు ఢీకొని యువకుడు మృతి.. రీల్స్ చూస్తూ.. బైకుకు తోసుకొచ్చాడా?

రోడ్డు ప్రమాదంలో వరంగల్ సర్పంచ్ మృతి... భర్త రవీందర్ పరిస్థితి విషమం

జార్ఖండ్: రూ. 2.20 కోట్ల రివార్డు.. సీపీఐ మావో నేత ఆకాష్ లొంగుబాటు

అన్నీ చూడండి

Suriya: సైకో పోలీస్ ఆఫీసర్‌గా సీన్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న సూర్య

Dulquer Salmaan : ఆకాశంలో ఒకతార గా ఎదగాలనే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్

Ranabali date: అక్టోబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రణబాలి మూవీ

Namit Malhotra: రామాయణ నుండి భారీ అప్‌డేట్ ప్రకటించిన నమిత్ మల్హోత్రా

Raka 37: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాకా 37 పోస్టర్ తో క్రేజ్

తర్వాతి కథనం
Show comments