Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేసవిలో జుట్టు సంరక్షణ...

Written By సిహెచ్
Updated: మంగళవారం, 7 మే 2019 (22:02 IST)
వేసవి కాలం మొదలైందంటే చాలు శరీరంలోని నీరంతా ఇంకిపోతుంది. దాంతో శరీరం పొడిబారుతుంది. రాషెస్ ఏర్పడి చిరాకు కలిగిస్తాయి. ఒక్క శరీరానికి మాత్రమే కాదు.. జుట్టుకు కూడా వేసవి కాలంలో చాలా ఇబ్బందులు ఏర్పడుతాయి. కాబట్టి మిగిలిన సీజన్ల కంటే ఈ వేసవి సీజన్లో కేశాలకు జాగ్రత్త వహించాల్సిందే. అవేంటో తెలుసుకుందాం. 
 
1. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో గుడ్డు పగులగొట్టి పసుపుగా ఉన్న సొన మాత్రమే వేయాలి. తర్వాత దానికి రెండు చెంచాల తేనె మరియు రెండు చెంచాల ఆలివ్ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేస్తూ గిలకొట్టాలి. ఇప్పుడు ఈ జుట్టు హెయిర్ ప్యాక్‌కు తలకు బాగా పట్టించి పది నిముషాలు అలాగే ఉంచేయాలి. తర్వాత గోరువెచ్చని నీటితో తలను శుభ్రం చేసుకోవాలి. ఈ హెయిర్ ప్యాక్ మీ తలకు చల్లదన్నాన్ని ఇవ్వడంతో పాటు కేశాలు మెరిసేలా చేస్తాయి. 
 
2. పెరుగు మరియు నిమ్మరసం రెండింటిని ఒక గిన్నెలో వేసి బాగా కలిపి తలకు, కేశాల చివరివరకూ బాగా పట్టించాలి. పది నిముషాల తర్వాత మంచి నీటితో శుభ్రం చేసుకోవాలి. దాంతో మీ కేశాలు ఆరోగ్యంగా ఉంటాయి. ఎటువంటి చుండ్రు మరియు దురద సమస్యలుండవు.
 
3. శీకాకాయ, ఉసిరికాయ, పెరుగు మరియు సోప్ నట్ అన్నింటిని కలిపి జుట్టుకి ప్యాక్‌లా వేసుకుంటే చాలా చల్లటి అనుభూతి కలుగుతుంది. సమ్మర్‌లో ఈ ప్యాక్ మంచి ఫలితాన్నిస్తుంది. తలనొప్పి తగ్గించి, రిలాక్సేషన్ ఇస్తుంది.  
 
4. గోరువెచ్చని గ్రీన్ టీని మాడుకు, శిరోజాలకు పట్టించి ఆరనివ్వాలి. తర్వాత నీళ్లతో తలంతా శుభ్రపరుచుకోవాలి. గ్రీన్ టీలోని యాంటీ ఆక్సిడెంట్లు, కండిషనర్ ఎండ వల్ల కలిగే హాని నివారించి, జుట్టు ఊడటాన్ని తగ్గిస్తాయి. గ్రీన్ టీలోని పోషకాలు శిరోజాలను పెంచడానికి దోహదం చేస్తాయి.
 
5. క్యారెట్‌ వేసవిలో జుట్టు సంరక్షణకు చాలా దోహదపడుతుంది. వేసవిలో జుట్టు ఎండిపోయి చివరలు చిట్లుతుంటాయి. క్యారెట్‌ ఆకులు చిట్లిపోయిన జుట్టుకు మంచి కండిషనర్‌గా పనిచేస్తాయి. ఆరు క్యారెట్‌ ఆకులకు ఒక టీ స్పూన్‌ నువ్వుల నూనె చేర్చి మిక్సీలో ముద్ద చేయాలి. ఈ నూనెను తలకు రాసుకుని పది నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల జుట్టు నిగారింపుగా పెరుగుతుంది.

అన్నీ చూడండి

బొడ్డులో కర్ర పెట్టి నొక్కే వైద్యం, నొప్పి పోతుందా? మనిషే పోతుందా?, వీడియో

కొళత్తూరులో టీవీకే అభ్యర్థి విజయం.. కోర్టులో సవాల చేసిన ఎంకే స్టాలిన్

Miss Universe India 2026, రంగు, రూపం కాదు ఆత్మవిశ్వాసం ముఖ్యం

ఆరేళ్ల ప్రేమ - కుటుంబ సభ్యుల అనుమతితో హిజ్రాను పెళ్లాడిన పూజారి (Video)

Gas Cylinder, సీఎం విజయ్ 3 సిలిండర్లు ఉచితం ప్రకటన, మరి 6 సిలిండర్లు అన్నారుగా?!!

అన్నీ చూడండి

Allari Naresh: ఫన్ తోపాటు ఊర మాస్ డైలాగ్ లతో రంభ ఊర్వశి మేనక ట్రైలర్

Zombie Reddy 2: టైటిల్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న జాంబీ రెడ్డి 2 నెక్స్ట్ లెవెల్

Kaka: ఆక్వాకల్చర్ కాన్సెప్ట్ తో కాకా చిత్రం - సెట్లో వెంకట్ కె నారాయణ పుట్టినరోజు వేడుక

Mahesh: మహేష్ హీరోగా లాంఛనంగా ప్రారంభమైన శివాలయం మూవీ

Mahakali update,: మహాకాళి అప్ డేట్ : ఆకట్టుకునేలా మహాకాళి గ్లింప్స్ - జనవరి 8న సిద్ధం

తర్వాతి కథనం
Show comments