సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By
Last Updated : శుక్రవారం, 3 మే 2019 (12:42 IST)

నీళ్లు సరిగ్గా తాగట్లేదా.. నిమ్మరసాన్ని మరిచిపోకండి.. ప్లీజ్..

నీళ్లు సరిగ్గా తాగట్లేదా.. అయితే ఓ గ్లాసుడు నిమ్మరసాన్నైనా తాగండి.. అంటున్నారు వైద్య నిపుణులు. వేసవిలో ముఖ్యంగా నిమ్మరసాన్ని డైట్‌లో చేర్చుకోవాలని వారు సెలవిస్తున్నారు. చాలామంది పనుల్లో పడి తగినంత నీరు తాగరు. దీంతో ఒంట్లో నీటిశాతం పడిపోతుంది. 
 
ఫలితంగా కిడ్నీలో రాళ్లు ఏర్పడటం వంటి సమస్యలూ ముంచుకొస్తాయి. అదే రోజూ ఉదయాన్నే నిమ్మరసం నీళ్లు తాగటం అలవాటు చేసుకుంటే ఒంట్లో నీటి శాతం పడిపోకుండా చాలావరకు నివారించుకోవచ్చు. పైగా నిమ్మరసం కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండానూ కాపాడుతుంది. 
 
వేసవిలో తప్పకుండా మూడు నుంచి నాలుగు గ్లాసుల నిమ్మరసాన్ని తీసుకోవాలని.. ఇలా చేస్తే డీ హైడ్రేషన్ బారి నుంచి తప్పించుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అలాగే నిమ్మరసంలోని ఫైటోన్యూట్రియంట్లు యాంటీఆక్సిడెంట్లుగానూ పనిచేస్తాయి. ఇవి విశృంఖల కణాల మూలంగా తలెత్తే అనర్థాల నుంచి కాపాడతాయి.