శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వార్తలు
Written By
Last Updated : బుధవారం, 1 మే 2019 (17:01 IST)

ఫైబర్ రైస్‌తో అధికబరువుకు చెక్...

ఇటీవలి కాలంలో అనేక మంది అధిక బరువుతో బాధపడుతుంటారు. ఈ సమస్య నుంచి బయటపడేందుకు వారంతా వివిధ రకాల వ్యాయామాలు, ఉపవాసాలు చేస్తుంటారు. అయితే, మద్రాస్ డయాబెటీస్ రీసెర్స్ ఫౌండేషన్ మాత్రం ఓ కొత్త విషయాన్ని వెల్లడించింది. 
 
ఫైబర్ రైస్‌తో అధిక రక్తపోటును నియంత్రణలో ఉంచొచ్చని తెలిపారు. అలాగే, బ్లడ్ షుగర్ స్థాయి అదుపులో ఉంటుంది తెలిపారు. అందుకే వైట్ రైస్ స్థానంలో హై ఫైబర్ రైస్‌ను తీసుకుంటే డయాబెటిస్ తగ్గుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. అధిక బరువు సమస్యకు కూడా ఇది చక్కని పరిష్కారమన్నారు. 
 
అదేసమయంలో పీచు పదార్థం ఎక్కువగా లభించే రైస్ తీసుకుంటే డయాబెటిస్, బ్లడ్ షుగర్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం నుంచి బయటపడొచ్చని తెలిపింది. పాలిష్ చేసిన బియ్యం(వైట్ రైస్) వాడకం వలన టైప్-2 మధుమేహం వస్తుందని, ఆపై కళ్లు, గుండె జబ్బులు, కిడ్నీ సమస్యలు, నరాల బలహీనత వంటి ఇతర జబ్బులు కూడా వచ్చే ప్రమాదముందని శాస్త్రవేత్తలు వెల్లడించారు.