1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : గురువారం, 2 మే 2019 (17:45 IST)

రైళ్లలో టీ వద్దనుకున్నారు.. ఇప్పుడు సోడాలు కూడా నో అంటారు.. ఎందుకు?

రైళ్లలోని టాయిలెట్లోకి టీ క్యాన్లు తీసుకెళ్లిన కథ మనకు తెలిసిందే. రైళ్ల టాయిలెట్ల నుంచి టీ క్యాన్లు ఎందుకు తీసుకెళ్లారో ఎవరికీ తెలియదు. కానీ ఈ దృశ్యాలున్న ఓ వీడియో గతంలో వైరల్ కావడంతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆపై వీడియోలో ఉన్న వ్య‌క్తులంద‌రినీ గుర్తించారు. వారిలో ఒక‌రు కాంట్రాక్ట‌ర్ ద‌గ్గ‌ర ఉద్యోగి కాగా, మిగిలిన ఇద్ద‌రూ అన‌ధికారిక వెండ‌ర్లు. 
 
ఆ ఉద్యోగి ప‌నిచేస్తున్న కాంట్రాక్ట‌ర్ శివ‌ప్ర‌సాద్‌కు ఐఆర్‌సీటీసీ ల‌క్ష రూపాయ‌ల జ‌రిమానా విధించింది. మిగిలిన ఇద్ద‌రు అన‌ధికారిక అమ్మ‌కందార్ల‌తో స‌హా, సికింద్రాబాద్ స్టేష‌న్లో అన‌ధికారికంగా ఉన్న వెండర్లంద‌రినీ తొల‌గించిన‌ట్టు రైల్వే అధికారులు ప్ర‌క‌టించారు.
 
ఈ ఘటన మరవకముందే.. కూల్ డ్రింక్స్‌లు, సోడాలకు తాగేవారికి షాకిచ్చే వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వేసవి అనగానే కూల్ డ్రింకులు, సోడాలకు డిమాండ్ పెరిగిపోతుంది. దీంతో సోడాలు తోపుడు బండ్లలో అమ్ముతుంటారు. సోడా కోసం కనీసం స్వచ్ఛమైన మంచినీళ్లను వాడతారని భావిస్తారు. అయితే ఈ వీడియోను చూస్తే ఆ నమ్మకం కాస్త పోతుంది. 
 
హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్ సమీపంలో ఓ వ్యక్తి సోడా బండిని పెట్టుకున్నాడు. అయితే సోడాలో వినియోగించే నీటి కోసం అతను అనుసరించిన మార్గం చూసిన ప్రజలు మాత్రం విస్తుపోయారు. ట్యాంక్ బండ్ సమీపంలో ఫ్లైఓవర్ దగ్గర మొక్కలకు నీళ్లు పడుతున్న ఓ మహిళ దగ్గరకు ఈ డబ్బాను తీసుకెళ్లి పెట్టాడు.

దీంతో ఆమె ట్యాప్ నీటిని అందులో నింపింది. దాన్ని తీసుకొచ్చిన అతను సోడాలు అమ్ముకునేందుకు బయలుదేరాడు. ఎవరు తీశారో తెలియదు కానీ ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.