శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : బుధవారం, 1 మే 2019 (15:02 IST)

భార్యాబిడ్డను హత్య చేసి ప్లాస్టిక్ డ్రమ్ములో కుక్కిన భర్త

హైదరాబాద్ నగరంలో దారుణం జరిగింది. ఓ కిరాతక భర్త కట్టుకున్న భార్యను, కన్నబిడ్డను పాశవికంగా హత్య చేశాడు. ఆ తర్వాత ప్లాస్టింగ్ డ్రమ్ములో కుక్కాడు. ఆ తర్వాత ఆ కిరాతక భర్త నగరాన్ని విడిచిపోయాడు.
 
రాచకొండ కమిషనరేట్‌ పరిధిలోని వనస్థలిపురం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగిన ఈ దారుణ హత్యల వివరాలను పరిశీలిస్తే, జనగామ జిల్లా లింగాలఘణపురం మండలం కొత్తపల్లికి చెందిన గౌరవరపు రాజమ్మ, ఉప్పలయ్య దంపతులు తన కూతురు కవిత, కొడుకుతో కలిసి మన్సూరాబాద్‌లో నివాసముంటున్నారు. 
 
ఇంటి పక్కన ఒడిషాకు చెందిన ఆయూబ్, కవితను ప్రేమించి నాలుగేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. గత 18 నెలలుగా సయ్యద్‌ ఇబ్రహిం ఇంట్లో రెండేళ్లుగా కుమారుడు ఇర్ఫాన్‌తో కలిసి ఆయూబ్, కవిత దంపతులు అద్దెకుంటున్నారు. 
 
ఆయూబ్‌ ఆటోనగర్‌లోని ఇసుక లారీల అడ్డాలో కూలీగా పనిచేస్తున్నాడు. భార్యాభర్తల మధ్య శనివారం గొడవ జరిగింది. అనంతరం భార్య కవిత, కుమారుడు ఇర్ఫాన్‌ను హత్యచేసి వారిద్దరి శవాలను డ్రమ్ములో కుక్కి పారిపోయి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. హత్య జరిగిన తర్వాత ఆయూబ్ కనిపించకుండా పోయాడు. 
 
దీంతో ఈ కిరాతకుడే భార్యాబిడ్డలను హత్య చేసి ఒడిషాకు పారిపోయివుంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఆయూబ్ కోసం రెండు ప్రత్యేక బృందాలను రాచకొండ కమిషనరేట్ ఏర్పాటు చేశారు. ఈ బృందాలు ఒడిషాకు వెళ్లి ఆయూబ్ కోసం గాలింపు చర్యలు చేపట్టనున్నారు.