సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : బుధవారం, 1 మే 2019 (14:01 IST)

పెళ్లికి ముందే దూరపు చుట్టమైన మహిళతో సంబంధం.. కొడుకు కూడా...

తన భర్తకు పెళ్లికి ముందే దూరపు చుట్టమైన మహిళతో అక్రమ సంబంధం ఉందనీ, ఆమెకు తన భర్తకు ఓ కుమారుడు ఉన్నాడనీ మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్డీ తివారీ కుమారుడు రోహిత్ శేఖర్ తివారీ భార్య అపూర్వ శుక్లా చెప్పుకొచ్చింది. 
 
ఇటీవల రోహిత్ శేఖర్ తివారీ అనుమానాస్పదంగా మృతి చెందిన విషయం తెల్సిందే. ఈ కేసులో రోహిత్ భార్య అపూర్వ శుక్లాను పోలీసులు అరెస్టు చేశారు. ఆమె వద్ద జరిపిన విచారణలో సంచలన నిజాలు బయటపెట్టారు. తన భర్తకు పెళ్లిముందే ఒక కొడుకు ఉన్నాడని, ఆ కొడుకునే ఆయన ఆస్తికి వారసుడిని చేయాలని భావించారని, అందుకే రోహిత్‌ను చంపేసినట్టు ఆమె పోలీసుల ఎదుట అంగీకరించారు. రెండు రోజుల పోలీసు రిమాండ్‌లో ఉన్న ఆమె తన వైవాహిక జీవితం, రోహిత్‌తో ఎదురైన సమస్యలు... హత్యకు దారితీసిన పరిస్థితులు క్షుణ్నంగా పూస గుచ్చినట్టు వివరించారు.
 
తన భర్త రోహిత్‌కు పెళ్లి ముందు నుంచే వివాహేతర సంబంధం ఉండటం తనను తీవ్రంగా దహించివేసిందని, అతనికి ఓ దూరపు చుట్టమైన మహిళతో అత్యంత సాన్నిహిత్యం ఉందని ఆమె పోలీసులకు తెలిపారు. 'ఆ మహిళ తన కొడుకు రోహిత్‌ ఆస్తిలో వాటా ఇవ్వాలని తరచూ కోరేది. మీ ఇంటి కొడుకే కదా అని తరచూ అంటుండేది. రోహిత్‌ కూడా ఆ పిల్లాడిపై ప్రేమ, ఆప్యాయతలు ఉండటం నా అనుమానాలను పెంచింది' అని ఆమె తెలిపింది. 
 
రాజకీయ ఆశయాలు ఉండటంతో మాట్రిమోనియల్‌ సైట్‌లో దివంగత నాయకుడు ఎన్డీ తివారీ కొడుడైన శేఖర్‌ తివారీ ప్రొఫైల్‌ను చూడగానే ఎంచుకున్నానని, ఆ తర్వాత కొన్నాళ్లు డేటింగ్‌ చేసిన తర్వాత 2018 మే 11న తాము పెళ్లి చేసుకున్నామని, కానీ, తమ వైవాహిక జీవితం ఎక్కువరోజులు నిలబడలేదని, అత్తింటివారితో సరిపడకపోవడంతో అదే ఏడాది మే 29న అత్తింటిని వీడి వచ్చానని ఆమె తెలిపారు. 
 
అనంతరం జులైలోనే రోహిత్‌కు విడాకుల నోటీసులు పంపానని, కానీ, హృదయ సంబంధ వ్యాధితో అతను ఆస్పత్రిలో చేరడంతో అతన్ని పరామర్శించాక.. తమ అనుబంధాన్నికొనసాగించాలని భావించానని ఆమె తెలిపారు. అత్త ఉజ్వల సింగ్‌ కూడా తరచూ తనను వేధించేదని, ఆమె అనుమతి లేకుండా కనీసం బెడ్‌రూమ్‌ కర్టైన్‌ కూడా మార్చనిచ్చేది కాదని అపూర్వ తెలిపారు.