శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By శ్రీ
Last Updated : బుధవారం, 1 మే 2019 (10:28 IST)

అతనితో చనువుగా ఉంటుందనీ లేడీ కానిస్టేబుల్‌ను చంపేసిన ఖాకీ

తనను కాదనీ మరో వ్యక్తితో చనువుగా ఉండటాన్ని జీర్ణించుకోలేకపోయిన ఓ కానిస్టేబుల్ తనతోపాటు పనిచేసే మహిళా కానిస్టేబుల్‌ను దారుణంగా హత్య చేశాడు. ఈ హత్య సంగారెడ్డి జిల్లాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, సంగారెడ్డి జిల్లా ఆర్సీపురం పోలీస్ స్టేషన్‌లో మందారిక అనే మహిళా కానిస్టేబుల్ పని చేస్తోంది. ఇదే ఠాణాలో ప్రకాష్ అనే వ్యక్తి కూడా కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు.
 
దీంతో మందారిక - ప్రకాష్‌లు అత్యంత సన్నిహితంగా ఉండసాగారు. ఈ క్రమంలో మందారిక వేరొకరితో చనువుగా ఉండటాన్ని ప్రకాష్ గమనించి, ఆమెను హెచ్చరించాడు. అయినా ఆమె ఏమాత్రం లెక్క చేయలేదు. దీంతో మందారికను నమ్మించి సంగారెడ్డి జిల్లా సదాశివపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్ళి అక్కడ దారుణంగా కొట్టి చంపేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి ప్రకాష్‌ను అదుపులోకి తీసుకున్నారు.