గుడ్డుసొనలో పెరుగు కలిపి ముఖానికి రాస్తే..?

గురువారం, 20 డిశెంబరు 2018 (11:28 IST)
చాలామందికి ముఖంపై మొటిమలు విపరీతంగా ఉంటాయి. వాటిని తొలగించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అంతేకాదు.. బయటదొరికే ఏవేవో క్రీములు, ఫేస్‌ప్యాక్స్ వాడుతుంటారు. ఇవి చర్మానికి కొంతమేరకు రక్షణ కలిగిస్తాయి. అయినప్పటికీ వాటితో పాటు ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు కూడా నిత్యం తీసుకోవాలి. దాంతో మొటిమలు రాకుండా నివారించవచ్చును. మరి అవేంటో చూద్దాం..
 
1. వారానికి రెండు లేదా మూడుసార్లు చేపలు తీసుకుంటే చర్మం రక్షణ పెరుగుతుంది. చేపలలోని ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కంటి ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతాయో.. అదేవిధంగా మొటిమలు నివారించడంలో అంతే పనిచేస్తాయి.
 
2. బీట్‌రూట్ రసాన్ని ముఖానికి రాసుకుంటే.. మొటిమలు పోతాయి. తరచు పుట్టగొడుగులు, నట్స్, తృణ ధాన్యాలు ఆహారంలో భాగంగా చేర్చుకుంటే చర్మాన్ని సంరక్షించుకోవచ్చునని బ్యూటీ నిపుణులు చెప్తున్నారు. 
 
3. పసుపు చర్మరక్షణకు ఎంతగానో పనిచేస్తుంది. చర్మ మంటను తగ్గిస్తుంది. అంతేకాదు.. చర్మాన్ని మృదువుగా, కాంతివంతంగా చేస్తుంది. కనుక ప్రతిరోజూ స్పూన్ పసులో కొద్దిగా నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకుంటే ముఖంపై గల మొటిమలు, నల్లటి మచ్చలు పోతాయి. 
 
4. బచ్చలి కూర మొటిమలకు యాంటీ ఏజెంట్‌లా పనిచేస్తుంది. ఈ కూరలోని విటమిన్ ఎ ముఖంపై మొటిమలు రాకుండా చేస్తాయి. బచ్చలి కూరను పేస్ట్‌లా చేసుకుని అందులో కొద్దిగా తేనె, ఆలివ్ నూనె కలిపి ముఖానికి అప్లై చేయాలి. 20 నిమిషాల తరువాత నీటితో కడుక్కుంటే.. ముఖం తాజాగా మారుతుంది. ఇలా వారం రోజుల పాటు చేస్తే మొటిమ సమస్యను నివారించవచ్చును.
 
5. గుడ్డు సొనలో కొద్దిగా పసుపు, కొబ్బరి నూనె, పెరుగు చేర్చి పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. 15 నిమిషాల పాటు అలానే ఉంచి ఆ తరువాత శుభ్రం చేసుకుంటే మొటిమలు పోతాయి. ఇలా రోజు తప్పక చేస్తే మొటిమలు రావు.  

అన్నీ చూడండి

Nara Lokesh: ప్రత్యేక సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు ఏపీ సర్కారు రెడీ

ఏపీలో 10 రోజులు సర్ గడువు పొడిగింపు... ఎన్నికల సంఘం

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఇకలేరు

రోడ్డు ప్రమాదాలు కామనే.. 18 ఏళ్ల యువకుడిపై కేసు పెడతారా?: వైఎస్ జగన్

మా బిడ్డ జీవితం కళ్లముందే బూడిదైపోయాడు : కేతన్ అగర్వాల్ తల్లి

అన్నీ చూడండి

Thiruveer: నేను కంఫర్టబుల్ గా ఉన్నా, నాటకాలు కంటే సినిమా చాలా పెద్ద బాధ్యత : హీరో తిరువీర్

'సత్లుజ్' మూవీ నిర్మాణ సంస్థపై కేంద్రం కన్నెర్ర.. ఎందుకో తెలుసా?

Varma: అన్వేషణ లో దర్శకుడు వంశీ నాకంటే బాగా సీన్స్ తీశారు : రామ్ గోపాల్ వర్మ

వెంకటేశ్వర స్వామి స్తోత్రాలను వెస్ట్రన్ స్టైల్‌లో విని ఆశ్చర్యపోయా : జి. నాగేశ్వర్ రెడ్డి

Rohit Saraf: ప్రశాంత్ వర్మ చిత్రం మహాకాళి షూటింగ్ పూర్తి చేసిన రోహిత్ సరాఫ్

తర్వాతి కథనం
Show comments