శనివారం, 9 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఉమెన్ స్పెషల్
Written By
Last Updated : సోమవారం, 3 డిశెంబరు 2018 (13:20 IST)

ఈ మట్టితో ప్యాక్ వేసుకుంటే..?

ఎవరికైనా అందంగా ఉండాలనే అనిపిస్తుంది. అయితే మెుటిమలు, నల్లటి మచ్చల కారణంగా చాలామంది అందాన్ని కోల్పోతున్నారు. వీటిని తొలగించుకోవడానికి రకరకాల క్రీములు, ఫేస్‌ప్యాక్‌లు వాడుతున్నారు. అయినా ఎలాంటి లాభాలు కనిపించలేదు.. అందుకు ఏం చేయాలో తెలుసుకుందాం.
 
ముల్తానీ మట్టి ప్యాక్:
ముల్తానీ మట్టిలో కొద్దిగా రోజ్ వాటర్, మెంతిపొడి కలిపి ముఖానికి రాసుకోవాలి. గంట తరువాత వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. వారానికి రెండుసార్లు ఇలా చేస్తే మెుటిమల సమస్య ఉండదు. ముల్తానీలోని విటమిన్ సి, డి చర్మాన్ని మెరుగ్గాచేస్తాయి. అలానే మృతకణాలను తొలగించి చర్మ రంగును పెంచుతాయి. తద్వారా వృద్ధాప్య ఛాయలు దూరమవుతుతాయి. 
 
ముల్తానీ మట్టిలో కొద్దిగా నిమ్మరసం, పసుపు, కొద్దిగా వంటసోడా కలిపి ముఖానికి, మెడకు పట్టించాలి. అరగంట తరువాత చల్లని నీటితో శుభ్ర పరచాలి. ఇలా తరచు చేస్తే చర్మం ఛాయ మెరిసిపోతుంది. నల్లటి మచ్చలు, వలయాలు రావు. శరీరంలోని చెడు పదార్థాలను తొలగించి ఆరోగ్యవంతమైన చర్మాన్ని అందిస్తుంది. అలానే కండరాలను పట్టి ఉంచి చర్మాన్ని బిగుతుగా చేస్తుంది. 
 
పావుకప్పు ముల్తానీ మట్టిలో స్పూన్ గంధం, చిటికెడు చక్కెర, కొద్దిగా రోజ్ వాటర్ కలిపి ముఖానికి అప్లై చేయాలి. ఇలా క్రమంగా చేస్తే చర్మం పొడిబారకుండా ఉంటుంది. దాంతో పాటు చర్మంపై గల రంధ్రాలను తొలగిస్తుంది. శరీరానికి కావలసిన తేమను అందిస్తుంది. ముల్తానీ మట్టిలోని మెగ్నిషియం, పొటాషియం, సోడియం, క్యాల్షియం వంటి పదార్థాలు చర్మాన్ని మృదువుగా, కాంతివంతంగా చేస్తాయి.