Daily Horoscope
✕

వారానికి ఒకసారి నిమ్మకాయ రసం-కోడిగుడ్డు-పసుపు కలిపి...

Written By సిహెచ్
Updated: మంగళవారం, 1 అక్టోబరు 2019 (20:43 IST)
నిమ్మకాయ రసం, కోడిగుడ్డులో తెల్లసొన, పసుపు సమపాళ్ళలో కలిపి ముఖానికి పట్టించి పది నిముషాల తర్వాత కడగాలి. ఈ విధంగా వారానికి ఒకసారి చేయాలి. ఇలా చేస్తే మొటిమలు తగ్గిపోతాయి.
 
ఏడాది పొడవునా ఒకే విధమైన పెర్‌ఫ్యూమ్ వాడకూడదు. వేసవి, వర్ష, శీతాకాలాలకు అనుగుణంగా పెర్‌ఫ్యూమ్ వాడుతుండాలి. 
 
పెరుగులో పసుపు కలిపి, ఆ మిశ్రమాన్ని పొట్టమీద క్రమం తప్పకుండా రాసుకుంటే గర్భం ధరించినప్పుడు పొట్టమీద ఏర్పడ్డ చారలు తగ్గిపోతాయి. అలాగే ఆలివ్ ఆయిల్‌లో కాస్త కర్పూరం కలిపి రోజూ పడుకునే ముందు ముఖానికి రాసుకుంటే మొటిమల తగ్గిపోతాయి. ముఖం మీద నల్లమచ్చలు పోవాలంటే ముఖానికి ఆవిరి పట్టాలి. 
 
కొత్తిమీర రసంలో చిటికెడు ఉప్పు కలిపి ముఖానికి రాసి అరగంట తర్వాత చన్నీటితో కడిగితే మొటిమలు తొలగిపోతాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.
 
శరీర దుర్వాసనతో బాధపడేవాళ్లు మొక్కజొన్నలు, గోధుమలు, పల్లీలు, ఇతర పప్పులు, మొలకలు, ధాన్యాలు, గుడ్డు వంటి వాటిని పరిమితంగా తీసుకోవాలి. స్నానం అయిన తర్వాత కొంచెం నీళ్లలో తేనె వేసి ఆ నీటిని ఒంటి మీద పోసుకోవాలి. ఇలా చేస్తే శరీరం దుర్వాసన ఉండదు.

అన్నీ చూడండి

నాన్ డైరీ పనీర్‌పై నిషేధం విధించిన ఏపీ సర్కారు

నా మెడలో పుస్తెల తాడునే లాగుతారా? దొంగలకు దేహశుద్ధి చేసిన మహిళ, వీడియో

ఏపీలో కరవు లేదు.. సీఎం చంద్రబాబును అభినందిస్తున్నా : కేటీఆర్

AP Local Body Polls: టీడీపీలో ఎవరైనా రెబెల్స్ ఇంకా మిగిలి ఉంటే సస్పెండ్ చేయాలి.. బాబు

అర్నబ్ నుంచి కోలుకోకముందే మరో ముప్పు.. దక్షిణ అండమాన్‌లో కొత్త అల్పపీడనం

అన్నీ చూడండి

S.S. Rajamouli: భావోద్వేగ ప్రధానాంశంతో కథలను ఎలా చెప్పాలో వివరించిన ఎస్.ఎస్. రాజమౌళి

Manoj: కాళాంకి భైరవుడు’ థర్డ్ సింగిల్ విడుదల చేసిన మంచు మనోజ్

Vishwak Sen: సున్నిత మనస్కులు, చిన్నపిల్లలు కల్ట్ సినిమాకు దూరంగా ఉండండి :విశ్వక్ సేన్

Trivikram: ఆదర్శ కుటుంబం మీ అందరికీ నచ్చుతుంది: త్రివిక్రమ్ శ్రీనివాస్

అనిరుధ్, కావ్యమారన్ వివాహ ఆహ్వాన పత్రిక.. సోషల్ మీడియాలో వైరల్

తర్వాతి కథనం
Show comments