శుక్రవారం, 3 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By
Last Modified: శనివారం, 21 సెప్టెంబరు 2019 (16:05 IST)

గోరింటాకు ఎర్రగా పండాలంటే.. ఏం చేయాలి?

గోరింటాకు అంటే ఇష్టంలేని మహిళలు ఎవ్వరూ ఉండరు. పండగలకు, శుభకార్యాలకు మహిళలు ఈ గోరింటాకును ఎంతో ఇష్టంగా పెట్టుకుంటారు. మగువలకు ఇష్టమైన గోరింటాకు ఎర్రగా పండాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం.
 
గోరింటాకు ఎర్రగా పండాలంటే నూరేటప్పుడు రెండు చుక్కల యూకలిప్టస్ ఆయిల్, రెండు చెంచాల నిమ్మరసం కలుపుకోవాలి. గట్టిగా రుబ్బిన తర్వాత గంటపాటు అలానే ఉంచి, ఆ పైన పెట్టుకుంటే చేతులు చక్కగా పండుతాయి. 
 
గోరింటాకుని నూరుకునేటప్పుడు రెండు లవంగాలూ, నిమ్మరసం, పంచదార, వక్క వంటివి కలుపుకున్నా చేతులు బాగా పండుతాయి. గోరింటాకు తీసేశాక ఆవనూనె రాసుకుంటే మంచి రంగు వస్తుంది. గోరింటాకు కనీసం నాలుగు గంటల పాటు చేతికి ఉంచుకుంటే చేతులు ఎర్రని వర్ణంతో మెరుస్తాయి.