శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By
Last Modified: శుక్రవారం, 20 సెప్టెంబరు 2019 (14:45 IST)

వర్షాకాలంలో చర్మం పొడిబారకుండా ఉండాలంటే.?

చినుకులు పడుతున్నాయ్. చర్మాన్ని ఇలా సంరక్షించుకోవచ్చు. చర్మం పొడిబారకుండా ఉండాలంటే.. గంటకు అర గ్లాసులు గోరువెచ్చని నీటిని తీసుకుంటూ వుండాలి. దాహం లేకపోయినా నీటిని సేవించాలి. ఇంకా చర్మానికి తరచూ మాయిశ్చరైజర్‌ రాస్తూ ఉండాలి. అలాగే స్నానం చేసే నీటిలో కాసిని గులాబీనీరు వేసుకుంటే మంచిది. అప్పుడప్పుడూ గులాబీనీరూ, గ్లిజరిన్‌ కలిపి చర్మానికి రాసుకుంటే పొడిబారకుండా ఉంటుంది.
 
అలాగే వర్షాకాలంలో జిడ్డు చర్మం గల వారు రోజులో నాలుగైదుసార్లు ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. రెండుమూడు చెంచాల సెనగపిండిలో కాసిని పాలూ, నిమ్మరసం, తేనె కలిపి ముఖానికి రాసుకోవాలి. ఇది పూర్తిగా ఆరాక కడిగేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తుంటే మంచిది. జిడ్డు లేకుండా ముఖం తాజాగా కనిపిస్తుంది.