శుక్రవారం, 22 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By
Last Updated : గురువారం, 1 ఆగస్టు 2019 (14:40 IST)

శొంఠి పొడిని నీళ్లలో కలిపి మరగబెట్టి తాగితే....

జలుబు చేసినప్పుడు శొంఠి పొడిని నీళ్లలో కలిపి మరగబెట్టి తాగితే ఉపశమనం కలుగుతుంది. అలాగే మరుగుతున్న టీ లేదా కాఫీలో కూడా ఈ పొడిని కొద్దిగా కలిపినా ప్రయోజనం ఉంటుంది.
 
యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్కను సమభాగాల్లో కలిపి చూర్ణం చేసుకొని భద్రపరుచుకోవాలి. కప్పు నీటిని మరిగించి, ఆ నీటిలో పావు చెంచా పొడి వేసి టీ లా కాచుకోవాలి. చివర్లో ఎనిమిది తులసి ఆకులు వేసి వేడివేడిగానే తాగాలి. ఇలా నిత్యం చేస్తే వర్షాకాలంలో వచ్చే అనారోగ్యాల నుంచి తప్పించుకోవచ్చు. 
 
కప్పు పాలల్లో అరచెంచా శొంఠి పొడి వేసి కలిపి కాచి గోరువెచ్చగా ఉన్నప్పుడు కొద్దిగా తేనె కలిపి తాగాలి. శొంఠి, పిప్పళ్లు, మిరియాలను విడివిడిగా మెత్తాగా పొడి చేసి సమభాగాల్లో కలుపుకోవాలి. దీన్ని త్రికటు చూర్ణం అంటారు. ఇది జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. జర్వం, దగ్గు, జలుబు, అలర్జీని నిరోధిస్తుంది.
 
చెంచాల శొంఠి కషాయంలో ఒక చెంచాడు ఆముదం కలిపి రాత్రి పడుకునేటప్పుడు సేవిస్తే విరేచనం సాఫీగా అవుతుంది. కడుపులో వాయువు తగ్గుతుంది. సయాటికా తగ్గుతుంది. ఇలా రోజు విడిచి రోజు మూడుసార్లు చేయవచ్చు.