గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By
Last Updated : మంగళవారం, 30 జులై 2019 (15:07 IST)

నట్స్ రోజూ 50 గ్రాములు తినండి.. శృంగార ఆసక్తిని పెంచుకోండి..

బరువును తగ్గించండం ద్వారా మేధోశక్తిని పెంపొందింపజేసుకునేందుకు నట్స్ తీసుకోవాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. బాదం, జీడిపప్పు, అక్రోట్స్ వంటి నట్స్‌ చేసే మేలు అంతా ఇంతా కాదు. వీటిని క్రమం తప్పకుండా తినటం వల్ల బరువు అదుపులో ఉంటుంది. అంతేగాకుండా.. శృంగార జీవితం మెరుగుపడటానికీ నట్స్ తోడ్పడుతాయి. 
 
రోజుకు 50 గ్రాముల గింజపప్పులు తినేవారిలో శృంగార ఆసక్తి పెరగటంతో పాటు మెరుగైన భావప్రాప్తిని పొందుతుండటం తాజా పరిశోధనలో తేలింది. 14 వారాల పాటు జరిపిన పరిశోధనలో నట్స్ తీసుకున్న వారిలో శృంగార ఆసక్తి, భావప్రాప్తి మెరుగుపడినట్టు తేలింది. 
 
గింజపప్పుల్లో ప్రొటీన్‌, పీచు, అత్యవసర విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా వున్నాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిల్లో వుండే ఫాలీఫెనాల్స్‌ వంటి యాంటీఆక్సిడెంట్లూ ఉంటాయి. ఇవి శృంగార లోపాలను దూరం చేస్తాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.