Webdunia - Bharat's app for daily news and videos

Install App

వర్షాకాలంలో వారానికోసారి పెడిక్యూర్ తప్పనిసరి...

Written By మనీల
Updated: గురువారం, 26 సెప్టెంబరు 2019 (13:17 IST)
వర్షాకాలం కదా వర్షంలో కాళ్లు తడవడంతో లేదా నీళ్లలో ఎక్కువసేపు ఉండటం వల్ల కాలి వేళ్ల మధ్య బ్యాక్టీరియా, ఫంగస్ చేరే ప్రమాదం ఉంది. దాంతోపాటు వాపు రావొచ్చు. ఈ ఇన్‌‌‌ఫెక్షన్ వల్ల చాలాసార్లు గోళ్లు పాడవుతాయి. ఇలా పాడవకుండా ఉండాలంటే తీసుకోవలసిన జాగ్రత్తలు.
 
చెప్పులు లేకుండా బయటకు వెళ్లకూడదు. ఇన్‌‌‌ఫెక్షన్ వచ్చే అవకాశం ఉన్నవారు, ఇంట్లోనూ సాధారణ చెప్పులు వేసుకొని తిరగాలి. నీళ్లల్లో ఎక్కువ సేపు నడిస్తే పాదాలు శుభ్రం చేసుకుని మాయిశ్చరైజర్ రాసి, సాక్సులు వేసుకోవాలి. పాదాలకు పగుళ్లు రాకుండా ఉంటాయి. 
 
కొన్ని ఇన్‌‌‌ఫెక్షన్లు బ్యాక్టీరియాతోనూ సంభవించవచ్చు. వీటివల్ల కాళ్లపై ఎర్రగా దద్దుర్లు వస్తాయి. దీన్ని అశ్రద్ధ చేస్తే భవిష్యత్తులో మరిన్ని అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. 
 
నీళ్లలో తడిసినప్పుడు ముందుగా యాంటీబయోటిక్ సబ్బుతో కాళ్లను శుభ్రం చేసుకోవాలి. ఆ తరువాత యాంటీసెప్టిక్ క్రీమ్ రాసుకోవాలి. కాలి గోళ్లపై పౌడర్ చల్లి తేమ పోయేలా చేసుకోవాలి. ఇలా చేస్తే ఇన్‌‌‌ఫెక్షన్ కారణమయ్యే బ్యాక్టీరియా, ఫంగస్‌‌‌ను చాలా వరకు నివారించవచ్చు.
 
రింగ్‌‌వార్మ్ అనే ఫంగల్ ఇన్‌‌‌ఫెక్షన్ వర్షకాలంలోనే ఎదురవుతుంది. మురికి నీటి ద్వారా వ్యాపించే ఈ ఫంగస్ చర్మానికి చేటు చేస్తుంది.
 
వారానికోసారి పెడిక్యూర్ తప్పనిసరి చేయించాలి. మృతకణాలు పేరుకోకుండా ఆరోగ్యంగా ఉంటాయి. ఏం చేసినా ఇన్‌‌‌ఫెక్షన్ తగ్గకపోతే తప్పనిసరిగా డాక్టర్‌‌‌ని సంప్రదించాలి.
 

అన్నీ చూడండి

కుమార్తె వ్యాఖ్యల వివాదం : మంత్రి కొండా సురేఖపై వేటు ఖాయమా?

ప్రేమ కోసం ఇరు విద్యార్థి వర్గాల మధ్య ఘర్షణ- 17 మంది అరెస్ట్

కేరళంలో భారీ వర్షాలు... ఏడు జిల్లాలకు రెడ్ అలెర్ట్.. పాఠశాలలకు సెలవు

ఉద్యోగినికి లైంగిక వేధింపులు - స్టార్ హోటల్ ఎండీపై కేసు నమోదు

అమ్మాయి చాటింగ్ చేయలేదని ఉరేసుకున్న బొబ్బిలి యువకుడు

అన్నీ చూడండి

చిరంజీవి ఎవరినీ తొక్కేయరు... పైకి ఎక్కిస్తారు : నిర్మాత బండ్ల గణేశ్

హ్యాపీ బర్త్‌డే చిరంజీవి.. మెగా టైటిల్‌తో ఫ్యాన్స్‌కు గిఫ్ట్

Tanikella Bharani: ప్రేమతో తీసిన ‘ప్రేమనే ఊరిలో అందరూ చూడాలని కోరుకుంటున్నా- తణికెళ్ల భరణి

Pawan Kalyan Kerala tour : ఆయుర్వేద థెరపీ కోసం కేరళం వెళుతున్న పవన్ కళ్యాణ్

Chiru, pawan: షావుకారు జానకి గారు ఇకలేరనే వార్త ఎంతో బాధ కలిగించింది

తర్వాతి కథనం
Show comments