ఈ అందాలను చూడాలంటే తిరుమల రావాల్సిందే(Video)

Pilgrims
జె| Last Modified శనివారం, 21 సెప్టెంబరు 2019 (17:25 IST)
గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు శేషాచలం అందాలు అద్భుతంగా కనిపిస్తున్నాయి. కొండల మధ్య నుంచి జాలువారే సెలయేళ్ళు అందరినీ కొత్తలోకంలోకి తీసుకెళుతున్నాయి. మాల్వాడిగుండం నుంచి వచ్చే నీటిలో భక్తులు స్నానాలు చేస్తున్నారు. శేషాచలం కొండలను దట్టమైన పొగమంచు కప్పేసింది. తిరుమల రెండు ఘాట్ రోడ్లలో పచ్చని చెట్లు భక్తులను పరవశింపజేస్తున్నాయి.

జలజలా జాలువారే సెలయేళ్ళు.. తిరుపతి బస్టాండ్ నుంచి తిరుమలకు వెళ్ళేంతవరకు కనువిందైన దృశ్యాలు కనువిందు చేస్తున్నాయి. తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తులు మాల్వాడి గుండం, కపిలతీర్థం వద్ద కాసేపు ఆగి సేదతీరుతున్నారు.దీనిపై మరింత చదవండి :