Daily Horoscope
✕

తెల్లవెంట్రుకల సమస్య, ఇలా చేస్తే...

Written By సిహెచ్
Updated: శనివారం, 4 సెప్టెంబరు 2021 (20:22 IST)
ఉసిరికాయల పొడి కలిపిన నీటిలో హెన్నాను రంగరించి మాడుకు పట్టిస్తే జుట్టు రాలడం సమస్యను అధిగమించవచ్చు. హెన్నా మంచి కండిషనర్‌గా పనిచేస్తుంది. దీనిని క్రమం తప్పకుండా వాడడం ద్వారా దట్టమైన జుట్టుతో పాటు.. శిరోజాలకు అవసరమైన పోషకాలు అందుతాయి.
 
నెలలో రోజుకు రెండుసార్లు తలకు ప్యాక్ వేయాలి. తద్వారా, దెబ్బతిన్న కురులు మరలా ఆరోగ్యకరంగా తయారవుతాయి. అన్నిటికంటే ముఖ్యంగా, హెన్నా చుండ్రుతో సమర్థంగా పోరాడుతుంది. రెండు టీ స్పూన్ల మెంతులను రాత్రంతా నీటిలో నానబెట్టిన తర్వాత మెత్తగా రుబ్బాలి. ఆవాల నూనెను మరిగించి గోరింట ఆకులను దాంట్లో వేయాలి. చల్లారిన తర్వాత మెంతుల చూర్ణాన్ని దానికి కలిపి మాడుకు పట్టించాలి. ఈ మిశ్రమం చుండ్రుపై బాగా పనిచేస్తుంది.
 
ఇక, తెల్ల వెంట్రుకలు వస్తున్నాయని బాధపడేవారికి ఇది మంచి నేస్తం. నీటిలో రెండు టేబుల్ స్పూన్ల ఉసిరి పొడి వేసి మరిగించాలి. దాంట్లో ఒక టీ స్పూన్ బ్లాక్ టీ, రెండు లవంగాలు వేసి బాగా కలియదిప్పాలి. 
 
అప్పుడు హెన్నా కలిపి చిక్కటి పేస్టులా కలుపుకోవాలి. కనీసం రెండు గంటలు కానీ, లేక, రాత్రంతా కానీ దాన్ని అలాగే ఉంచాలి. ఆ తర్వాత తలకు అప్లై చేయాలి. దీన్ని రాసుకోవడం ద్వారా తెల్లవెంట్రుకలు కాసింత రంగు పులుముకుంటాయి.

అన్నీ చూడండి

ఇటుకతో చిన్నారిపై రాక్షస దాడి చేసిన బాలుడి మానసిక స్థితి చెక్ చేస్తాం, కేసు కూడా: పంచకుల డిసిపి

రంపంతో విద్యార్థినిపై దాడి: నిశ్చేష్టురాలినై గోడకు ఆనుకుని అలాగే నిలబడిపోయానన్న టీచర్

ప్రైవేటు ఉద్యోగులు పిజ్జాలు పంచుకుంటూ డ్యాన్స్ చేయొచ్చు కానీ ప్రభుత్వ ఉద్యోగులు చేయకూడదా, వీడియో

తల్లి నిద్రిస్తుండగా శిశువును ఎత్తుకెళ్లిన ముగ్గురు..

అర్నబ్ పోయింది, మురసు Murasu వస్తోంది?!! మచిలీపట్నానికి 1200 కి.మీ దూరంలో...

అన్నీ చూడండి

విశ్వక్ సేన్, తరుణ్ భాస్కర్ ల సీక్వెల్ ఈ నగరానికి ఏమైంది రిపీట్ ట్రైలర్ రాబోతోంది

నువ్వు విలన్ వి ? చనిపోతావా? ఓడిపోతావా? అని నిలదీశిన యశ్ కుమారుడు

Rudravanam PS Series Review: రుద్రవనం పీఎస్ లో మర్డర్ల రహస్యం ఏమిటి? వెబ్ సిరీస్ రివ్యూ

Prakash Raj, ఇచ్చిన సినీ అడ్వాన్సులు వెనక్కి తీస్కుంటున్నారు: ప్రకాష్ రాజ్ భార్య పోనీ

జయంత్ అండ్ ది జింగో పెన్ చిత్రం తారే జమీన్ పర్ లా సక్సెస్ అవ్వాలి

తర్వాతి కథనం
Show comments