ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. బడ్జెట్ 2017-18
Written By ivr
Last Modified: ఆదివారం, 29 జనవరి 2017 (21:11 IST)

బడ్జెట్టుతో మార్కులు కొట్టేసి యూపీని పట్టేస్తారేమో... మోదీజీ ఇప్పుడే వద్దు... అఖిలేష్

వార్షిక బడ్జెట్ 2017-18 ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టబోతోంది మోదీ సర్కారు. దీనిపై యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బడ్జెట్ ద్వారా ఐదు రాష్ట్రాల ఓటర్లను ప్రలోభపెడుతారేమోనన్న అనుమానాన్ని ఆయన వ్యక్తం చేస్తున్నారు. అందువల్ల ఎన్నికలు

వార్షిక బడ్జెట్ 2017-18 ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టబోతోంది మోదీ సర్కారు. దీనిపై యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బడ్జెట్ ద్వారా ఐదు రాష్ట్రాల ఓటర్లను ప్రలోభపెడుతారేమోనన్న అనుమానాన్ని ఆయన వ్యక్తం చేస్తున్నారు. అందువల్ల ఎన్నికలు ముగిసిన తర్వాత బడ్జెట్టును ప్రవేశపెట్టాలంటూ ఆయన ప్రధానికి లేఖ ద్వారా తెలియజేసారు. 
 
కేంద్రం ఫిబ్రవరి 1న బడ్జెట్టును ప్రవేశపెట్టిన తర్వాత ఫిబ్రవరి 4న పంజాబ్, గోవా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభమవుతాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఫిబ్రవరి 11న మొదలవుతాయి. ఉత్తరాఖండ్, మణిపూర్ రాష్ట్రాల్లోనూ అదే తేదీలో జరుగుతాయి. మార్చి 11న ఫలితాలు వెల్లడిస్తారు. ఈ నేపధ్యంలో బడ్జెట్టు ద్వారా ఓటర్లను ప్రలోభపెడతారనే అనుమానాలను అఖిలేష్ వ్యక్తం చేసారు. దీనిపై సుప్రీంకోర్టులో పిటీషన్ వేయగా, ఇందులో తను జోక్యం చేసుకోబోమని సుప్రీం తేల్చి చెప్పింది.