ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 19 ఏప్రియల్ 2021 (16:53 IST)

అబ్‌ ఇన్బెవ్‌ ఇండియా పునరుత్పాదక విద్యుత్‌: తెలంగాణాలోని క్రోన్‌ బ్రూవెరీ వద్ద 18% తమ విద్యుత్‌ను సౌర విద్యుత్‌తో భర్తీ

ఆహ్లాదకరమైన భవిష్యత్‌ నిర్మించే దిశగా తమ నిబద్ధతను మరింతగా పునరుద్ఘాటిస్తూ తెలంగాణాలోని అబ్‌ ఇన్బెవ్‌ ఇండియా యొక్క క్రోన్‌ బ్రూవెరీ ఇప్పుడు సౌర విద్యుత్‌ దిశగా అడుగులు వేస్తుంది. తమ బ్రూవింగ్‌ కార్యకలాపాల వ్యాప్తంగా గ్రీన్‌ విద్యుత్‌ స్వీకరణనూ వేగవంతం చేస్తుంది.

తమ మూడవ బ్రూవరీలో పునరుద్పాదక విద్యుత్‌ను స్వీకరించడం ద్వారా అబ్‌ ఇన్బెవ్‌ యొక్క అంతర్జాతీయ నిబద్ధతను పునరుద్ఘాటించడంతో పాటుగా 2025 నాటికి పునరుత్పాదక వనరుల నుంచి 100% విద్యుత్‌ను కొనుగోలు చేయాలనే కంపెనీ నిబద్ధతనూ వెల్లడిస్తుంది. మైసూరు, ఔరంగాబాద్‌లలోని ప్రపంచంలోనే సుప్రసిద్ధమైన బ్రూవర్‌ సదుపాయాలు గతంలో పాక్షికంగా పునరుత్పాదక విద్యుత్‌ దిశగా మళ్లాయి.
 
క్రోన్‌ బ్రూవరీ వద్ద సౌర విద్యుత్‌ ప్యానెల్స్‌ కోసం ఈ ప్రాజెక్ట్‌ సామర్థ్యం డీసీ 998 కెడబ్ల్యుపీ, ఏసీ 773 కిలోవాట్లు. ఇది రమారమి రోజుకు 4వేల యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుంది. తద్వారా రోజుకు 22వేల యూనిట్ల విద్యుత్‌ అవసరమైన అబ్‌ ఇన్బెవ్‌ ఇండియాకు 18% విద్యుత్‌ ఇప్పుడు పునరుత్పాదక వనరుల ద్వారా లభిస్తుంది.
 
‘‘సస్టెయినబుల్‌ పద్ధతులను స్వీకరించడం పట్ల మేము చాలా సంతోషంగా ఉన్నాము. ఇది మేము కార్యకలాపాలు నిర్వహిస్తోన్న చోట కమ్యూనిటీలపై సానుకూల ప్రభావం చూపుతుంది. వాతావరణ మార్పులు ఇప్పుడు మన ప్రపంచానికి ప్రమాదాన్ని కలిగిస్తూనే ఉన్నాయి. అబ్‌ ఇన్బెవ్‌ వద్ద మేము ఆకుపచ్చ ప్రత్యామ్నాయాలను స్వీకరించడానికి కట్టుబడి ఉన్నాము. భారతదేశంలో మా మూడవ బ్రూవరీ ఇప్పుడు పునరుద్పాదక విద్యుత్‌ను స్వీకరించడంపట్ల సంతోషంగా ఉన్నాము. సమీప భవిష్యత్‌లో దేశంలో మరిన్ని ప్రాంతాలలో ఈ కార్యక్రమాలను స్వీకరించడం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము’’ అని అశ్విన్‌ కాక్‌, ప్రొక్యూర్‌మెంట్‌ అండ్‌ సస్టెయినబిలిటీ హెడ్- ఇండియా అండ్‌ సౌత్‌ ఈస్ట్‌ ఆసియా, అబ్‌ఇన్బెవ్‌ అన్నారు.
 
ఆర్‌-100లో భాగం అబ్‌ ఇన్బెవ్‌. సహకార యుక్త, అంతర్జాతీయ కార్యక్రమం ఆర్‌-100. 100కు పైగా ప్రభావం చూపగల వ్యాపార సంస్థలు ఏకతాటిపైకి రావడంతో పాటుగా తమ కార్యకలాపాలలో పునరుత్పాదక విద్యుత్‌ వినియోగానికి కట్టుబడి ఉన్నాయి. భవిష్యత్‌లో ఇవే తరహా ఒప్పందాలను చేసుకునేందుకు కంపెనీ ప్రణాళిక చేస్తుంది. పునరుద్పాదక విద్యుత్‌ను స్వీకరించడం ద్వారా దీనిని ప్రదర్శించేందుకు కంపెనీ ప్రయత్నిస్తోంది.ఇక్కడ వ్యాపార సంస్థలు 100% పునరుత్పాదక విద్యుత్‌కు తోడ్పాటునందించనున్నాయి.