శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 15 జులై 2021 (09:09 IST)

పెరిగిన పెట్రోల్ ధరలు - స్వల్పంగా తగ్గిన డీజిల్ ధర

దేశంలో చమురు ధరల్లో స్వల్పంగా హెచ్చు తగ్గులు కనిపించాయి. పెట్రోల్‌ ధర ఆకాశమే హద్దుగా పెరుగుతుండగా, డీజిల్ ధర మాత్రం స్వల్పంగా తగ్గింది. రోజువారీ సమీక్షలో భాగంగా దేశీయ చమురు కంపెనీలు లీటర్‌ పెట్రోల్‌పై 36 పైసలు పెంచగా, డీజిల్‌పై 16 పైసలు తగ్గించాయి. దీంతో దేశరాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.101.54కు చేరింది. ఇక డీజిల్‌ ధర రూ.89.87గా ఉన్నది. 
 
గురువారం పెంచిన ధరతో ముంబైలో పెట్రోల్‌ రూ.107.54, డీజిల్‌ రూ.97.45, భోపాల్‌లో పెట్రోల్‌ రూ.109.89, డీజిల్‌ రూ.98.67, కోల్‌కతాలో పెట్రోల్‌ రూ.101.74, డీజిల్‌ రూ.93.02గా ఉన్నది. హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.105.51, డీజిల్‌ 97.62గా చేరింది.