మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 5 జులై 2021 (09:56 IST)

మిస్సైల్ వేగంతో పెట్రోల్ - డీజిల్ ధరల పరుగులు

దేశంలో పెట్రోల్ - డీజిల్ ధరలు సరికొత్త రికార్డులను నెలకొల్పుతున్నాయి. ఈ ధరల పెరుగుదల మిస్సైల్ వేగంతో పరుగులు తీస్తున్నాయి. ప్రతి రోజూ పెరుగుతున్న పెట్రోలు, డీజిల్ ధరలు సామాన్యులపై ఎనలేని భారం మోపుతున్నాయి. 
 
సోమవారం పెట్రోలుపై 35 పైసలు, డీజిల్‌పై 18 పైసలు పెరిగాయి. ఫలితంగా 14 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పెట్రోల్ ధర 100 రూపాయలు దాటేసింది. మూడు రాష్ట్రాల్లో డీజిల్ ధర కూడా రూ.100 దాటిపోయింది.
 
తాజా పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోలు ధర రూ.99.51గా ఉండగా, హైదరాబాద్‌లో రూ.103.41గా ఉంది. డిజిల్ ధర లీటరు రూ.97.40గా ఉంది. కాగా, పశ్చిమ బెంగాల్ ఎన్నికల సమయంలో వరుసగా 18 రోజులపాటు స్థిరంగా ఉన్న పెట్రో ధరలు ఆ తర్వాతి నుంచి ఇప్పటివరకు 34 సార్లు పెరగడం గమనార్హం. 
 
అయితే పెరుగుతున్న పెట్రోల్ ధరకు కళ్లెం వేయాలని దేశంలోని విపక్ష పార్టీలన్నీ గగ్గోలు పెడుతున్నాయి. పలు ప్రాంతాల్లో ఆందోళనలు, ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నాయి. అయినప్పటికీ అటు చమురు సంస్థలు లేదా కేంద్ర ప్రభుత్వం మాత్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదు.