పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు
పెట్రోల్, డీజిల్ ధరలు రోజు రోజుకీ పెరిగిపోతోంది. పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యునికి మరింత భారంగా పరిణమిస్తున్నాయి. ప్రభుత్వ చమురు సంస్థలు ఈరోజు (జూలై 4) పెట్రోల్, డీజల్ ధరలను మరోమారు పెంచాయి.
ఆదివారం ఢిల్లీలో పెట్రోలు ధర లీటరుకు 35 పైసలు పెరగగా, డీజల్ ధర లీటరుకు 18 పైసలు చొప్పున పెరిగింది. దీంతో ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ. 99.51 పైసలు కాగా డీజిల్ ధర లీటరుకు రూ. 89.36 పైసలుకు చేరుకుంది.
ప్రస్తుతం పెంచిన ధరలతో ముంబైలో లీటరు పెట్రోల్ ధర రూ,105.24 పైసలు, డీజల్ లీటరు రూ. 96.72 పైసలు, చెన్నైలో పెట్రోలు లీటరు ధర రూ. 100.24 పైసలు, డిజల్ లీటరు రూ. 93.72 పైసలుకు చేరుకుంది.