ఆగని పెట్రోల్ బాదుడు.. సెంచరీని దాటే దిశగా పెట్రోల్
పెట్రోల్ బాదుడు ఆగడం లేదు. లీటర్ పెట్రోల్ సెంచరీని దాటే దిశగా దూసుకుపోతోంది. డీజిల్ ధరలు సైతం పెట్రోల్ ధరలతో పోటీపడి పెరుగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర సెంచరీకి చేరువైంది. తాజాగా పెట్రోల్‌పై 35 పైసలు మేర రేటు పెరిగింది. గత రెండు నెలల వ్యవధిలో పెట్రోల్ ధర 35 సార్లు పెరగగా, డీజిల్ 34 సార్లు ధర పెరగడం గమనార్హం.
సోమవారం దేశ రాజధాని ఢిల్లీలో ఒక లీటర్ పెట్రోల్ ధర రూ.99.86 కు చేరుకోగా, డీజిల్ ధర రూ.89.36 వద్ద నిన్నటి ధరకు విక్రయాలు జరుగుతున్నాయి. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లోనూ... పెట్రోల్ ధర 37 పైసల మేర పెరిగింది.
హైదరాబాద్‌లో ఈరోజు లీటర్ పెట్రోల్ ధర రూ.103.78కు చేరగా, డీజిల్ నిన్నటి ధర రూ.97.40గా ఉంది. హైదరాబాద్ కంటే జిల్లాలలో అధిక ధరలకు పెట్రోల్, డీజిల్ విక్రయాలు జరుగుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో అత్యధికంగా పెట్రోల్ ధర రూ. 105.80, డీజిల్ ధర రూ.105.37గా ఉన్నాయి. ఇక విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ.105.59 కాగా, లీటర్ డీజిల్ ధర రూ.99.01గా ఉంది.