2024లో దేశంలో అత్యంత వేగవంతమైన డెలివరీ వేగాలను ఆనందించిన అమేజాన్ ప్రైమ్ సభ్యులు
అమేజాన్ ఇండియా 2024లో ప్రైమ్ సభ్యుల కోసం అత్యంత వేగంగా డెలివరీలు చేసింది. అదే రోజు లేదా మరుసటి రోజు 41 కోట్లకు పైగా వస్తువులను అందచేసింది, కస్టమర్లు తమకు కావలసినప్పుడు తమకు అవసరమైనది పొందారు. కస్టమర్లు కేవలం టైమ్‌ను మాత్రమే ఆదా చేయడం లేదు, ప్రైమ్ సభ్యులు అత్యంత వేగంగా, ఉచితంగా గత ఏడాది సగటున 3300 కూడా ఆదా చేసారు-వార్షిక ప్రైమ్ సభ్యత్వం ఖర్చు కంటే రెండు రెట్లు ఎక్కువ. అంతర్జాతీయంగా, అమేజాన్ ప్రైమ్ 9 బిలియన్ యూనిట్లను అదే రోజు లేదా మరుసటి రోజు అందచేసింది. ప్రపంచవ్యాప్తంగా సభ్యులు సుమారు $ 95 బిలియన్లను వేగవంతమైన, ఉచిత డెలివరీలో ఆదా చేసారు.
అతి పెద్ద ఎంపికతో వేగం కస్టమర్లకు ప్రధానమైనదని అర్థం చేసుకుని, అమేజాన్ నిరంతరంగా డెలివరీ సామర్థ్యాలు, లాజిస్టిక్స్‌లో పెట్టుబడి పెట్టింది. అత్యంత వేగాలకి అతి పెద్ద ఎంపిక చేయబడిన వస్తువులను అందచేయడానికి, అమేజాన్ ప్రైమ్ అదే రోజు/మరుసటి రోజు డెలివరీ ద్వారా 2024లో 11%కి పైగా పిన్ కోడ్స్ సంఖ్యను పెంచి సేవలు అందచేసింది, ప్రైమ్ ప్రయోజనాలు పొందడానికి భారతదేశపు పట్టణాలు, నగరాలలో ఎక్కువమంది కస్టమర్లకు డెలివరీలు అందచేస్తోంది. ఈ రోజు, ప్రైమ్ సభ్యులు 10 లక్షలకు పైగా వస్తువుల విలక్షణమైన ఎంపికలో అపరిమితంగా అదే- రోజు డెలివరీని, మరుసటి రోజు డెలివరీని అమెజాన్‌లో 40 లక్షలకు పైగా వస్తువులను పొందుతున్నారు. అంతే కాదు, ఉప-అదే రోజు డెలివరీతో, ప్రైమ్ సభ్యులకు కేవలం 4 గంటలలో డెలివరీ చేయబడే 20 వేలకు పైగా బెస్ట్ సెల్లింగ్ వస్తువుల ఎంపిక అమెజాన్‌లో అందుబాటులో ఉన్నాయి.
“మేము చేసే ప్రతి పనిలో మా కస్టమర్లు కీలకంగా ఉంటారు. అత్యంత వేగవంతమైన డెలివరీ వేగాలతో అమేజాన్లో వారి షాపింగ్‌కు మేము విలువ చేర్చడమే కాకుండా వారు ఆదా చేయడానికి కూడా మేము సహాయపడ్డామని తెలుసుకోవడం ఎంతో వినయంగా ఉంది” అని అక్షయ్ సాహి, డైరెక్టర్ & అమేజాన్ ప్రైమ్ హెడ్, స్పీడ్ & ఫుల్ ఫిల్మెంట్ ఎక్స్‌పీరియెన్స్, ఇండియా అన్నారు. “ప్రైమ్ అనుభవాన్ని మేము నిరంతరంగా మెరుగుపరచడానికి, తమకు కావలసినది, అవసరమైనప్పుడు పొందడంతో పాటు షాపింగ్, వినోదం, ఇంకా ఎన్నో వాటిలో వారు ప్రయోజనాలను ఆనందించడంలో సభ్యులను నిర్థారించడానికి కట్టుబడ్డాము.”