గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 8 మే 2018 (16:08 IST)

అక్కడ పెట్రోల్ 52 రూపాయలే... ఎగబడికొంటున్న జనం!

దేశవ్యాప్తంగా పెట్రోల్ ధరలు మండిపోతున్నాయి. దీంతో వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. అయినప్పటికీ.. వినియోగదారులకు చీమకుట్టినట్టయినా లేదు.

దేశవ్యాప్తంగా పెట్రోల్ ధరలు మండిపోతున్నాయి. దీంతో వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. అయినప్పటికీ.. వినియోగదారులకు చీమకుట్టినట్టయినా లేదు.
 
అయితే అస్సాంలోని భారత్- భూటాన్ సరిహద్దుకు సమీపంలో నివసించే కొందరు ప్రజలు మాత్రం ఈ పెట్రో మంట నుంచి కాస్త ఉపశమనం పొందేందుకు సరికొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. అస్సాంలో లీటర్ పెట్రోల్ ధర 76 రూపాయలు. అదే భూటాన్‌లో అయితే 52 రూపాయలు. 
 
అంటే అస్సాంతో పోలిస్తే భూటాన్‌లో లీటర్ పెట్రోల్‌ 24 రూపాయలు తక్కువకే దొరుకుతోంది. దీంతో భూటాన్‌లోని సంద్రుప్ జాంగ్‌ఖర్ అనే పట్టణానికి సరిహద్దుకు సమీపంలో ఉన్న భారతీయులు క్యూ కడుతున్నారు. రోజుకు కొన్ని వందల మంది పెట్రోల్ కోసం భూటాన్‌ బాట పడుతున్నారు.
 
పెట్రోల్ ఒక్కటే కాదు డీజిల్ కూడా దాదాపు 20 రూపాయలు తక్కువ ధరకే లభ్యమవుతుందట. అంతేకాదు, మద్యం కూడా 20 రూపాయలు తక్కువకే దొరుకుతుండటంతో మందుబాబులు ఎగబడి కొనుక్కుంటున్నారట. భూటాన్ కరెన్సీ గుల్ట్రం కూడా భారతీయ కరెన్సీ రూపాయి విలువకు దాదాపు సమానంగా ఉండటంతో సరిహద్దు వాసులు ఎలాంటి ఇబ్బందులు తలెత్తడం లేదు. దీంతో పెట్రోల్ కొనుగోలు చేసేందుకు భూటాన్ దేశానికి క్యూకడుతున్నారు.