గురువారం, 28 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : సోమవారం, 13 నవంబరు 2017 (14:51 IST)

కాంగోలో ఘోర రైలు ప్రమాదం.. 33మంది మృతి.. భోగీల్లో నిప్పంటుకోవడంతో?

నవంబర్ 13 2017.. సోమవారం ప్రపంచ వ్యాప్తంగా ప్రమాదాల్లో మృత్యువాత పడిన వారి సంఖ్య అధికమవుతోంది. రాష్ట్రంలోని కృష్ణానదిలో బోటు మునిగిన ఘటన ఓ వైపుంటే.. ఇరాన్-ఇరాక్‌లలో చోటుచేసుకున్న భారీ భూకంపంతో 150 మంద

నవంబర్ 13 2017.. సోమవారం ప్రపంచ వ్యాప్తంగా ప్రమాదాల్లో మృత్యువాత పడిన వారి సంఖ్య అధికమవుతోంది. రాష్ట్రంలోని కృష్ణానదిలో బోటు మునిగిన ఘటన ఓ వైపుంటే.. ఇరాన్-ఇరాక్‌లలో చోటుచేసుకున్న భారీ భూకంపంతో 150 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. తాజాగా కాంగోలో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. బోగీలకు నిప్పు అంటుకోవడంతో ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. 
 
ఈ ప్రమాదంలో 33మంది మృతి చెందారు.. మరో 26 మంది తీవ్రగాయాలకు గురైయ్యారు. సంఘటనా స్థలికి చేరుకున్న సహాయక సిబ్బంది... అక్కడికి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆసుపత్రికి క్షతగాత్రులను తరలించి, చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. బోగీల్లో అక్రమ రవాణా జరిగిందని.. అందుకే ఆయిల్ టాంకర్లకు నిప్పంటుకుని ఈ ప్రమాదం జరిగి వుంటుందని అధికారులు అనుమానిస్తున్నారు.