శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 21 డిశెంబరు 2016 (13:07 IST)

ఏటీఎంల్లో ఎంతైనా తీసుకోవచ్చు.. డిసెంబర్ 30తో సీన్ మారనుందా? బ్లాక్ మనీ పార్టీలకు చెక్?

నల్ల కుబేరులకు చెక్ పెట్టే దిశగా కేంద్ర ప్రభుత్వం నోట్ల రద్దు చేసిన సంగతి తెలిసిందే. నోట్ల రద్దు తర్వాత ఏటీఎంల్లో నగదు లావాదేవీలపై కేంద్రం పరిమితి విధించిన సంగతి తెలిసిందే. రోజుకు 2,500 రూపాయల నగదును

నల్ల కుబేరులకు చెక్ పెట్టే దిశగా కేంద్ర ప్రభుత్వం నోట్ల రద్దు చేసిన సంగతి తెలిసిందే. నోట్ల రద్దు తర్వాత ఏటీఎంల్లో నగదు లావాదేవీలపై కేంద్రం పరిమితి విధించిన సంగతి తెలిసిందే. రోజుకు 2,500 రూపాయల నగదును మాత్రమే అందించిన ఆర్బీఐ ఇక నుంచి ఈ నిబంధనను ఎత్తివేయనున్నట్లు సమాచారం. డిసెంబర్ 30 తర్వాత ఏటీఎంల్లో లావాదేవీలపై విధించిన పరిమితిని ఎత్తివేయాలని కేంద్రం భావిస్తోంది. 
 
ఇందులో భాగంగా త్వరలోనే కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు కేంద్ర మంత్రి సంతోష్ గంగ్వార్ ప్రకటించారు. డిసెంబర్ 30లోపు పరిస్థితులు సాధారణ స్థితిలోకి వస్తాయని ఆశిస్తున్నామని, ఇప్పటికే చాలాచోట్ల బ్యాంకు సేవలు మెరుగుపడ్డాయని చెప్పుకొచ్చారు. డిసెంబర్ 30 తర్వాత విత్‌డ్రా పరిమితులపై సమీక్షిస్తామని కూడా ఇటీవలే ప్రకటించారు. 
 
ప్రస్తుతం ఏటీఎంల నుంచి ఒకసారి రూ. 2500 మాత్రమే తీసుకునే వీలుంది. వీలున్న విషయం తెలిసిందే. అలాకాకుండా, మన ఖాతాలో ఉన్న మొత్తం.. బ్యాంకులు విధించే పరిమితిని బట్టి ఎంత కావాలంటే అంత తీసుకోడానికి అవకాశం ఉంటుంది. 
 
అలాగే బ్యాంకుల నుంచి విత్‌డ్రా చేసుకునే మొత్తం మీద కూడా ఆంక్షలు ఎత్తేసే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం బ్యాంకుల నుంచి వారానికి రూ. 24వేలు మాత్రమే తీసుకోడానికి అవకాశం ఉంది. డిసెంబర్ 30వ తేదీ తర్వాత ఇక నగదు కొరత అనేది ఉండబోదని ఆర్థిక శాఖ వెల్లడిస్తోంది. 
 
ఇకపోతే.. బ్లాక్ మనీ కార్యకలాపాలపై కఠినచర్యలలో భాగంగా 200 రాజకీయ పార్టీలపై వేటువేయాలని ఎన్నికల సంఘం భావిస్తోంది. దీనికి సంబంధించి కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డుకి ఎన్నికల సంఘం త్వరలోనే లేఖ రాయనుంది. ఈ పార్టీలు మనీ లాండరింగ్ కార్యకలాపాలను ఎక్కువగా కొనసాగిస్తున్నాయనే ఆరోపణలతో ఎన్నికల కమిషన్ ఈ 200 పార్టీలను డీలిస్టు చేయాలని సీబీడీటీకి పిలుపునిచ్చింది. 
 
ఎన్నికల సీజన్ లో రాజకీయ పార్టీలు మనీ లాండరింగ్ కార్యకలాపాల్లో ప్రధానపాత్ర పోషిస్తున్నాయని ఎన్నికల సంఘం తెలిపింది. రాజకీయ పార్టీగా నమోదు చేసుకున్నప్పటి నుంచి ఈ పార్టీల ఆర్థిక కార్యకలాపాలను పరిశీలించాలని సీబీడీటీని కోరింది. దీంతో బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చుకునేందుకు రాజకీయ పార్టీగా అవతారమెత్తాలని భావించేవారికి చెక్ పెట్టాలని ఎన్నికల సంఘం భావిస్తోంది.