ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 13 సెప్టెంబరు 2017 (12:59 IST)

త్వరలో రూ.100 నాణేల విడుదల... ఎంజీఆర్, సుబ్బులక్ష్మీ బొమ్మలతో?

నోట్ల రద్దు కారణంగా చిల్లర కష్టాలను తొలగించేందుకు కేంద్ర ఆర్థిక శాఖ నడుంబిగించింది. ఇప్పటికే రూ.200 నోట్లను విడుదల చేసిన కేంద్ర ఆర్థిక శాఖ ప్రస్తుతం రూ.100 నోట్లకు బదులుగా నాణేలను ప్రవేశపెట్టేందుకు సి

నోట్ల రద్దు కారణంగా చిల్లర కష్టాలను తొలగించేందుకు కేంద్ర ఆర్థిక శాఖ నడుంబిగించింది. ఇప్పటికే రూ.200 నోట్లను విడుదల చేసిన కేంద్ర ఆర్థిక శాఖ ప్రస్తుతం రూ.100 నోట్లకు బదులుగా నాణేలను ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా త్వరలో రూ.100 నాణేల‌ను ఆర్థిక శాఖ విడుదల చేయనుంది. 
 
ఎంజీ రామచంద్రన్‌, ఎంఎస్ సుబ్బుల‌క్ష్మిల‌ జ్ఞాపకార్థం వారి శతదినోత్సవ సంద‌ర్భంగా రూ.100, రూ. 5, రూ.10 నాణేల‌ను ముద్రిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. కొన్ని నాణేలను ఎంజీఆర్ బొమ్మ‌తోను, మ‌రికొన్నింటి వెనుక భాగంలో ఎంఎస్ సుబ్బులక్ష్మి బొమ్మ‌ను ముద్రిస్తామ‌ని తెలిపింది. అలాగే రూ.10 కాయిన్‌పై సుబ్బులక్ష్మి బొమ్మను, రూ.5 కాయిన్‌పై ఎంజీఆర్ బొమ్మను ముద్రిస్తామని కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది.
 
ఇందులో భాగంగా వందరూపాయల నాణెం44 మి.మీట్లర్లుగా వుంటుందని.. నాలుగు సింహాల అశోనకుని స్థూపం బొమ్మ కూడా ఈ నాణెంపై ముద్రించనున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ ఆ ప్రకటనలో వెల్లడించింది. ఈ నాణెం బరువు 35 గ్రాములు వుంటుందని.. వెండి, రాగితో పాటు నికెల్, జింక్‌ల మిశ్రమాన్ని ఈ నాణెం తయారీకి ఉపయోగించినట్లు కేంద్ర ఆర్థిక శాఖ పేర్కొంది.