మంగళవారం, 5 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 22 డిశెంబరు 2023 (21:25 IST)

విశేషమైన వృద్ధి, భవిష్యత్తు ఆదాయ లక్ష్యాలను ప్రకటించిన ఎవల్యూటిజ్

Evolutyz
విశాఖపట్నంలో ప్రధాన కార్యాలయంగా ఉన్న ఐటి ఆధారిత సేవలు, ఐటి ఉత్పత్తుల కంపెనీ ఎవల్యూటిజ్, ఈరోజు తన సంవత్సర-సంవత్సరానికి రెండంకెల వృద్ధిని ప్రకటించింది. ప్రస్తుతం భారతదేశంలో 650 మంది నిపుణులతో బలమైన శ్రామికశక్తిని కలిగి ఉంది, వీరిలో 500 మంది విశాఖపట్నం, హైదరాబాద్‌లో పని చేస్తున్నారు. అదనంగా 150 మంది గ్లోబల్ లొకేషన్‌లలో పనిచేస్తున్నారు, కంపెనీ తన కార్యాచరణ స్థాయి, సామర్థ్యాలలో గణనీయమైన పురోగతిని ప్రదర్శించింది.
 
ఎవల్యూటిజ్ ఒక ప్రముఖ రాబోయేతరం ఐటి ఉత్పత్తులు, ప్లాట్‌ఫారమ్‌లు. ఐటి సేవల కంపెనీ. ఈ కంపెని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, బిగ్ డేటా, ఇతర డీప్ టెక్ ప్లాట్‌ఫారమ్‌లపై అధునాతన ఉత్పత్తులు, ప్లాట్‌ఫారమ్‌లను నిర్మిస్తోంది. వివిధ సంస్థలకు హామీ ఇవ్వబడిన వ్యాపార ఫలితాలు, అంతరాయం లేని కస్టమర్ సేవలు, తదితర ఐటి, డిజిటల్ సేవలను ఎవల్యూటిజ్ అందిస్తోంది.
 
ఐటి కన్సల్టింగ్ కంపెనీగా 2011లో చికాగోలో ప్రధాన కార్యాలయంగా యువ భారతీయ టెక్కీలచే ఎవల్యూటిజ్ కార్ప్ స్థాపించబడింది. దీని భారతీయ కార్యకలాపాలు అక్టోబర్ 2016లో విశాఖపట్నంలో ప్రారంభమయ్యాయి. తరువాత హైదరాబాద్, నోయిడా, బెంగుళూరు, పూణేలో ఒక డెవలప్‌మెంట్ సెంటర్‌‌గా తన కార్యాలయాలను విస్తరించింది. అలాగే గోవాలో కొత్త ఆఫీస్ స్పేస్‌తో, కంపెనీ తన వృద్ధిని, వనరుల అవసరాలను వేగవంతం చేసి, కంపెనీ దాని వృద్ధి, వనరుల అవసరాలను వేగవంతం చేసింది. ఇప్పుడు, ఎవల్యూటిజ్ తన విజయవంతమైన భారతీయ ప్రయాణంలో తన 10వ సంవత్సరాల వేడుకలను విశాఖపట్నంలో జరుపుకుంటోంది.
 
గత 24 నెలల్లోనే, ఎవల్యూటిజ్ ఆదాయాలలో ఆకట్టుకునే 140% వృద్ధిని సాధించింది, ఇది దాని బలమైన వ్యాపార వ్యూహాలకు, శ్రేష్ఠతకు నిబద్ధతకు నిదర్శనం. ఈ ఊపును కొనసాగిస్తూ కంపెనీ ప్రస్తుతం ఉన్న ఆదాయాన్ని రూ 430 కోట్ల నుండి వచ్చే 24 నెలల్లో రూ 650 కోట్లకు అధిగమించాలని ప్రతిష్టాత్మకంగా లక్ష్యంగా పెట్టుకుంది.
 
10 సంవత్సరాల వార్షికోత్సవ వేడుకల సందర్భంగా ఎవల్యూటిజ్ వ్యవస్థాపకుడు, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ శ్రీనివాస అరసాడ మాట్లాడుతూ, "మా స్థిరమైన వృద్ధి అత్యాధునిక సాంకేతిక పరిష్కారాలను అందించడంలో మా అంకితభావానికి ప్రతిబింబం. కస్టమర్ సంతృప్తిపై మా దృష్టి. మా బృందం సాధించిన విజయాల పత్ల మేము గర్విస్తున్నాము. వృద్ధి, ఆవిష్కరణల ఈ పథాన్ని కొనసాగించడానికి కట్టుబడి ఉన్నాము." అని అన్నారు.
 
ఎవల్యూటిజ్ పరిశోధన, అభివృద్ధిలో తన పెట్టుబడిని మరింతగా పెంచడానికి అంకితం చేయబడింది, పోటీ సాంకేతిక పరిశ్రమలో దాని అభివృధిని కొనసాగించడానికి తాజా సాంకేతికతలపై దృష్టి సారించింది. "మా వృద్ధి కేవలం సంఖ్యలో మాత్రమే కాదు; సాంకేతికత అడాప్షన్, ఇన్నోవేషన్ పరంగా మనం ఎలా ఎదుగుతున్నాం అన్నది ఎప్పటికప్పుడు చూస్తుంటాము. రిసర్చ్, అభివృద్ధిలో పెట్టుబడులు పెట్టడం మా వ్యూహానికి కీలకం, మేము సక్రమార్గంలో ముందంజలో ఉన్నామని, మా క్లయింట్‌లకు అసమానమైన పరిష్కారాలను అందించడం కొనసాగిస్తాము" అని శ్రీనివాస అరసాడ అన్నారు.