శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By
Last Updated : గురువారం, 5 సెప్టెంబరు 2019 (12:14 IST)

#lufthansaSpecialSale ఫ్లైట్‌లో అలా ఎగిరి వచ్చేయండి..

అవును.. #lufthansaSpecialSale హ్యాష్ ట్యాగ్‌ ప్రస్తుతం టాప్ ట్రెండింగ్‌లో వుంది. విమాన సేవల్లో కీలక సంస్థ అయిల లుఫ్తన్సా కస్టమర్లకు మంచి ఆఫర్ ప్రకటించింది. ఇందులో భాగంగా యూరప్, నార్త్ అమెరికాలో పర్యటించాలనుకునే ప్రయాణీకులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. 
 
ఈ దేశాలను సందర్శించాలనుకునే వారు సెప్టెంబర్ 18 లోపు బుక్ చేయాల్సి వుంది. అలా బుక్ చేసుకుంటే 2020, 30 జూన్‌లోపు యూరప్, నార్త్ అమెరికాలను ఎప్పుడైనా చూసి రావొచ్చు. 
 
రూ.38,500లు చెల్లించి యూరప్‌ను చుట్టేయవచ్చునని, నార్త్ అమెరికాకు లుఫ్తన్సా ఆఫర్‌లో వెళ్లాలంటే.. రూ.58,000 చెల్లించాల్సి వుంటుందని సంస్థ వెల్లడించింది.