శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 1 సెప్టెంబరు 2021 (17:44 IST)

'కూ'లో ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్న నటి కృతి సనన్ చేరిన వారంలోనే 20 వేలకు చేరిన ఫాలోవర్లు

భారతీయ సోషల్ మీడియా ప్లాట్ఫారం అయిన కూ (Koo) లో చేరిన నటి కృతి సనన్, వారంలోనే  20,000 మంది ఫాలోవర్లను సొంతం చేసుకున్నారు. ఈ బాలీవుడ్ నటి @kritisanon అనే హ్యాండిల్‌తో తన అభిమానులకు చేరువయ్యారు. రెండు వారాల క్రితం తన స్నేహితుడు, స్టార్ నటుడు టైగర్ ష్రాఫ్ భారతీయ మైక్రో బ్లాగింగ్ ప్లాట్ఫారంలో చేరి అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చి, వారి నుంచి ఘనమైన స్వాగతం పొందారు. కృతి చేరిన వెంటనే తన ఫ్యాన్ క్లబ్స్ కూడా ప్రొఫైల్స్ క్రియేట్ చేశారు.
 
కృతి సనన్ కూలో తన అబ్బురపరిచే కళ్ల ఫోటోతో తను చేరినట్టు ప్రకటించడంతో పాటు మిగతా సోషల్ మీడియా ప్లాట్ఫారం లలో కూడా షౌట్ ఔట్ ద్వారా కూలో చేరినట్టు తన అభిమానులకు తెలిపారు. ఈ నటి రీసెంట్‌గా పోస్ట్ చేసిన ఒక అందమైన ఫోటోగ్రాఫ్‌కి 1700కు పైగా లైక్స్ వచ్చాయి. కృతి ఇప్పుడు వివిధ భాషలలో తన అభిమానులతో కనెక్ట్ అవడానికి కూని ఉపయోగించనుంది.
 
యువ నటి అయిన కృతి సనన్ తన ప్రాజెక్ట్స్ మరియు స్క్రిప్ట్స్‌తో పాపులారిటీ మరియు సపోర్ట్ సంపాదించుకుంటున్నారు. ఈ మధ్య ఓటీటీ లో విడుదలై స్క్రీన్ ప్లే మరియు తన నటనకు విమర్శకుల ప్రశంసలు పొందిన మిమ్మీ సినిమా తో సూపర్ హిట్ అందుకున్నారు. కృతి ఇప్పుడు ప్రభాస్ తో భారతీయ పౌరాణిక చిత్రం ఆదిపురుష్ లో నటిస్తున్నారు.
 
కూ యాప్ ని డౌన్లోడ్ చేయడం ఎలా: 
మొబైల్ యాప్ స్టోర్ లో యూజర్లు డౌన్లోడ్ చేసుకోవడానికి ఈ యాప్ అందుబాటులో ఉంది. యూజర్లకు తమ మొబైల్ నంబర్ లేదా ఇమెయిల్ ఐడిని ఉపయోగించి రిజిస్టర్ చేసుకునే అవకాశం ఉంది. రిజిస్టర్ పూర్తయిన తర్వాత, వారు తమ అభిమాన నటులు, ప్రముఖులు, అథ్లెట్లు, రాజకీయ నాయకులు, ఎంటర్టైనర్లను కూలో ఫాలో అవ్వొచ్చు. యూజర్లు వారి స్థానిక భాష మరియు వారికి నచ్చిన భాషలలో కమ్యూనికేట్ చేయడానికి కూ ఉపయోగపడుతుంది.