Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారీగా తగ్గిన పసిడి ధర.. బంగారం కొనేయాల్సిందే మరి..

ఆషాఢ మాసం ముగియనున్న నేపథ్యంలో.. శ్రావణ మాసం నుంచి పెళ్లిళ్ల సందడి మొదలు కానుంది. ఆషాఢ పూర్తయ్యాక పెళ్లి చేసేయాలంటూ.. ముహూర్తం కుదుర్చుకున్న వారికి శుభవార్త. బంగారం ధరలు గురువారం భారీగా తగ్గిపోయాయి. మ

Written By Selvi
Updated: గురువారం, 2 ఆగస్టు 2018 (18:42 IST)
ఆషాఢ మాసం ముగియనున్న నేపథ్యంలో.. శ్రావణ మాసం నుంచి పెళ్లిళ్ల సందడి మొదలు కానుంది. ఆషాఢ పూర్తయ్యాక పెళ్లి చేసేయాలంటూ.. ముహూర్తం కుదుర్చుకున్న వారికి శుభవార్త. బంగారం ధరలు గురువారం భారీగా తగ్గిపోయాయి. మార్కెట్‌ లో 10 గ్రాముల బంగారం ధర రూ.365 తగ్గి, రూ.30,435 రూపాయలుగా ఉంది. 
 
ఇక కేజీ వెండి ధర రూ.50 తగ్గి రూ.40 వేల కింద రూ.39 వేలుగా రికార్డ్ అయ్యింది. అమెరికా ఫెడరల్‌ రిజర్వు వడ్డీ రేట్లు పెంచకుండా యథాతథంగా ఉంచడంతో డాలర్‌ బలపడింది. అంతర్జాతీయంగానూ బంగారం ధర 0.65 శాతం పడిపోయింది. ఔన్స్‌ 1,215.50 డాలర్లుగా నమోదైంది. 
 
బలహీనమైన గ్లోబల్‌ ట్రెండ్‌తో పాటు, దేశీయంగా ఆభరణ వర్తకుల నుంచి డిమాండ్‌ తగ్గిపోయింది. దీంతో రాజధాని ఢిల్లీలో 99.9 శాతం, 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధరలు 365 రూపాయల చొప్పున పడిపోయి రూ.30,435, రూ.30,285గా నమోదైనాయి.

అన్నీ చూడండి

Suriya: సైకో పోలీస్ ఆఫీసర్‌గా సీన్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న సూర్య

Dulquer Salmaan : ఆకాశంలో ఒకతార గా ఎదగాలనే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్

Ranabali date: అక్టోబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రణబాలి మూవీ

Namit Malhotra: రామాయణ నుండి భారీ అప్‌డేట్ ప్రకటించిన నమిత్ మల్హోత్రా

Raka 37: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాకా 37 పోస్టర్ తో క్రేజ్

తర్వాతి కథనం
Show comments