సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఎం
Last Modified: గురువారం, 27 ఫిబ్రవరి 2020 (12:12 IST)

మళ్లీ పడిపోయిన బంగారం ధర, ఎక్కడెక్కడ ఎలా వున్నాయి?

బంగారం ధరలు నేల చూపులు చూస్తున్నాయి. మూడోరోజు కూడా బంగారం ధరలు తగ్గాయి. వివిధ మార్కెట్లలో బుధవారం బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.43,050, విజయవాడలో రూ.43,100, విశాఖపట్నంలో రూ.43,890, ప్రొద్దుటూరులో రూ.43,100, చెన్నైలో రూ.42,840గా ఉంది. 
 
ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.41,030, విజయవాడలో రూ.39,900, విశాఖపట్నంలో రూ.40,370, ప్రొద్దుటూరులో రూ.39,960, చెన్నైలో రూ.40,800గా ఉంది. 
 
వెండి కిలో ధర హైదరాబాదులో రూ.47,000, విజయవాడలో రూ.49,000, విశాఖపట్నంలో రూ.48,500, ప్రొద్దుటూరులో రూ.48,500, చెన్నైలో రూ.51,400 వద్ద ముగిసింది.